The Word Today:
మానవునికి ఎంత ధనం ఉన్న, భూములు ఉన్నా, బంగారం ఉన్నా, సమాజంలో ఉన్నతమయిన స్థితిని కలిగి ఉన్నా, సంతృప్తి ఉందని స్థితి ఉంది, అదే సంతానం కలిగి లేకపోవడము. మన కష్టార్జితాన్ని అనుభవించే వారసులు లేకపోతే చాల విచారకరం. సంతానం లేకపోవడం వలన సమాజంలో కూడా ఎంతో కొంత చిన్న బోతావుంటారు. కొంతమంది గృహాలలో కోడళ్ళను ఇబ్బంది పెడతారు, కొంతమంది ఉన్నబార్యను వదిలి పిల్లకోసం అని వేరే వివాహం చేసుకుని మొదటి బార్యను ఇబ్బంది పాలు చేస్తారు. ( మనలో మన మాట, భర్త వలన సంతానం కలగడం లేదని తెలిసి భార్య వేరే వివాహం చేసుకుంటే ఎలా ఆహ్వానిస్తారు ) అసలు సంతానం దేవుని బహుమానం. ప్రతి మానవుడు సంతానం కలిగి ఉండటమే దేవుని ఉద్దేశ్యం, ప్రణాళిక. అయితే కొన్ని పర్యాయాలు మన శరీరం లోని అసమతౌల్యం వలన, శరీరం తత్వం వలన పిల్లలు కలగక పోవొచ్చు, కొన్ని సార్లు సాతాను వలన గర్భం మూయబడి పోవొచ్చు, కొన్ని సార్లు దేవుని చిత్తంలో ఆలస్యం అవ్వోచు. అయితే కారణం ఏదైనా ఒక అవకాసం ఉంది. ఇప్పుడు మీకు ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను. ఆది 25: 21 "ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యోహావాను వేడుకునేను. యెహోవ అతని భార్యయైన రిబ్కా గర్భవతి ఆయెను." ఇస్సాకు వలె ఇంట్లో భార్యల కొరకు భర్తలు ప్రార్ధించడం మొదలు పెట్టండి, . "కీర్తన 113:9 ఆయన సంతులేని ఇల్లాలుగాను కుమాళ్ళ సంతోషముగల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించండి". ఒకవేళ ఆలస్యం అయ్యిందా, ఇస్సాకు, మహోన్నా కంటేనా? అబ్రాహము కంటే ఆలస్యం అనుకుంటున్నావా? అబ్రహాముకు ఇవ్వగలిగిన దేవుడు నీకు ఇచ్చుటకు సమర్ధుడు కాదా? నీ కన్నిట్టిని తుడిచి ప్రభువు మిమ్మును ఆనంద భాష్పాలతో నింపును గాక!
షలోమ్
మీకోరకు ప్రార్ధించే
అపోస్తులు నెల్లి నాని బాబు