ఒక రోజు ఇశ్రాయేలీయుల ప్రజలకు స్వతంత్రం వచ్చింది. కానీ వారిని పాలకులు వదలరు వీరే పాలకులను వదిలి వేరే ప్రాంతానికి వెళ్ళాలి. ఇంచుమించు 11 రోజుల ప్రయాణం. ప్రయాణం ప్రారంబించారు. సంతోష గానాలతో, కేరింతలతో, తేలికైన హృదయాలతో, కళలు కంటున్నారు, లెక్కలు చూసుకుంటున్నారు, ఎప్పుడు చూద్దామా అని ఎంతో కోలాహలంతో ముందుకు దూసుకు పోతున్నారు. .... కొంత దూరం వెళ్లేసరికి వీరి హృదయాలలో పెద్ద బాండ రాయి పడినట్లయింది. పాటలు లేవు, అరుపులు లేవు, వాటికి బదులు ఆక్రందనలు, తిట్లు , సణుగుళ్లు మొదలయ్యాయి ఎందుకంటే అక్కడ ఒక సముద్రం ముందు ఉండి వెక్కిరిస్తుంది. ఎక్కడికి? అని... ఈలాంటి పరిస్థితులు నీకు ఎదురయ్యాయా? సంతోషంగా పని మొదలు పెట్టిన కొంత సమయానికే చేదు వార్త వినవలసి వచ్చిందా? నీ సంతోష గణాలు ఆక్రందనలుగా మారాయా? నీ జీవితంలో నాకు ఇక తిరుగులేదు అనుకున్న సమయం లో తిరిగి ఎక్కడి నుండి వచ్చామో అక్కడికే వెళ్లాల్సిన సందర్భాలు గాని ఉన్నాయా? ప్రియా స్నేహి ... బయపడకు దేవుని వాక్యం లో ఒక వాగ్దానం ఉంది. యెషయా నేను నీతో చెప్పియున్నాను నీకు తోడై ఉన్నాను. భయపడకుము నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము నేను నిన్ను బలపరతును. నీకు సహాయము చేయు వాడను నేనే. నీతి యను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును. యెషయా 31:15 మీరు ఊరకుండి నమ్ముట వలన మీకు బలము కలుగు. అక్కడ దేవుడు నీకు సహాయం చేయడానికె సముద్రాన్ని ఉంచాడు. అయన శక్తీ నీకు తెలియడానికి, నీ శత్రువు తుదముట్టించడానికి అదే అనుకూల ప్రదేశం. ఒకటి ప్రజలకు పిలిచినా దేవుడు గొప్ప వాడని, శత్రువు మరల వారిమీదకు రాకుంఢా చెయ్యాలి. ఒక్క పనిలో అన్ని పూర్తి చెయ్యడానికే తీసుకొచ్చారు. . నీకు కూడా అంతే... నీకు ఉన్న ప్రతి అడ్డంకి యేసునాములో తొలగిపోవును గాక? నీ శత్రువును నీవు చూడకుందువు గాకా!
మీ కొరకు ప్రార్ధించే
అపోస్తులు నెల్లి నాని బాబు