మానవుని జీవితం స్వల్ప కాలికం. ఈ జీవితం తరువాత మరింత గొప్ప జీవితం దాగి ఉంది. అది అంతం లేనిది. అయితే దానికి రెండు ఎంపికలు ఉన్నాయి. ఒకటి మానవుని కొరకు దేవుడు నిర్మించిన గొప్ప సూపర్ స్మార్ట్ సిటి, అందులో బంగారముతో వేసిన రోడ్లు, చీకటి లేనిది, ఒకొక్కరికి ఒకొక్క గృహం, ప్రతి ఒక్కరికి ఒకొక్క ఇంటి స్థలం దానిలో భవనం, ఆకలి అనే మాట రాకుండా ఉండే నిరంతంర ఆహారం నీటి సదుపాయం, కాలుష్యం లేని వాతావరణం, ఏడ్వడం అనే మాట వినపడని సిటి. ఇవన్ని కూడా ఏవిధమయిన దరఖాస్తులు పెట్టుకోకుండానే, అర్జీలు లేకుండానే సిధం చేయబడతాయి. అయితే మరొకటి ఉంది అది గర్వం వలన ఉన్నత లోకాల నుండి గెంటి వేయబడిన వానికి వాని అనుచరులకు సిధం చేయ బడింది. అందులో గర్వాన్ని, అహంకారాన్ని, మోసాన్ని, తిరుగుబాటును అణచి వేసే మహా అగ్ని తో నింపబడిన ఒక పెద్ద చెరువు. అందులోకి ఎలాగు వెళ్లి పోవాలి అని అర్ధం అయిన సాతాను, వాడితో పాటు మనుషులను తోడు తీసుకుని వెళ్దామని అనేక ప్రణాలికలు వేస్తున్నాడు. అందులో నిజం అనిపించే ఒక పెద్ద అబద్ధం ఉంది. అదే నీకు ఇంకా చాల సమయం ఉంది. నీకు ఎంత సమయం ఉంది అనేది నీకు తెలుసా? నీవు ఇప్పుడు చనిపోతవో నీకు తెలుసా? మరి అలాంటప్పుడు నీకు ఇంకా సమయం ఉంది అని ఎలా నమ్ముతున్నావు. సిలువ మీద దొంగ లా మారుదువు లే... చనిపోయే ముందు ఒప్పుకుంటే దేవుడు క్షమించడా? అని చెపుతున్నాడు నీకు వాడు. అదే నిజం అనుకుందాము,.... చనిపోయే ముందు నీకు తెలుస్తుందా? చనిపోయే ముందు నీకు దేవుని గురుంచి అలోచన వస్తుందా? అసలు చనిపోయే ముందు మాట్లాడే అవకాసం ఉంటుందా? ఒక్క సారి చనిపోయిన వారిని అలోసించు ...... అందుకే సాతాను నీకు నిజం లాంటి గొప్ప అబధం చెపుతున్నాడు. నీకు సమయం లేదు. ఇప్పుడే యేసును రక్షకునిగా అంగికరించు, పాపాలు ఒప్పుకో, విడిచి పెట్టు, బాప్తిసం పొందు.... నపుంసకుడు రక్షణ బాప్తీస్మం పొందడానికి ఆలస్యం చెయ్యలేదు.... ఎపేసి 5:19 ...
మనందరం కలసి దేవుడు మన కొరకు కట్టిన పరలోకం ఉండాలని ఆశిస్తూ...
అపోస్తులు నాని బాబు నెల్లి