అసలు నీకు నిజమయిన స్నేహితుడు ఎవరు? నీకు ఎదురు పడే వారందరు నీకు స్నేహితులేనా? నీతో సమయాన్ని గడిపే వారందరు స్నేహితులేనా? నీవు ఎంతమందికి నిజమయిన స్నేహితుడవు? అసలు నిజమయిన స్నేహితుడు ఏమి చేస్తాడు? జీవితం లో కొన్ని పర్యాయాలు తొందరపాటు నిర్ణయాలు వలన, అపార్ధాల వలన నిజమయిన స్నేహితులను కోల్పోతుంటాము. నిజమయిన, మనకోసం దేవుడు నిర్ణయించిన మన హృదయానికి దగ్గర అయిన స్నేహితుడను కనుగొనడం ఎలా? దానికి పరిశుద్ధ గ్రంధం లో ఒక మాట ఈరోజు కొరకు గుర్తు చేసి ముగిస్తాను. నిజ స్నేహితుడను గుర్తించడానికి ఒక కొలమానం సామెతలు 27:6 లో ఇలా ఉంది. మేలు కోరి స్నేహితుడు గాయములు చేయును. పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెట్టును. అలా అని ముద్దులు పెట్టేవారందరు పగవారు కాదు, గాయాలు చేసేవారందరు స్నేహితులు కారు. దీనిని అర్ధం చేసుకోడానికి మరో మాట పరిశుద్ధాత్ముడు సోలోమోను ద్వారా చెప్పారు. సామెతలు 20:30 గాయములు చేయు దెబ్బలు అంతరంగములలో చొచ్చి చేడుతనమును తొలగించును. సామెతలు 6:23 శిక్షార్ధమయిన గద్దింపులు జీవమార్గములు. చేడుతనమును ప్రోత్సయించే వాడు కచ్చితంగా నీకు విరోధి. సామెతలు 16:29 బలత్కారి తన పొరుగు వానిని లాలన చేయును, కాని మార్గములో వాని నడిపించును. ఒకవేళ ఆ వయస్సులో ఇది తప్పు కాదు అని చెప్పి, మామూలే అని నిన్ను ప్రోత్సయించినప్పుడు అప్పటికి అది నీకు మంచి అయివుండవొచ్చు కాని దాని వలన బవిషత్ లో సమస్యలకు గురి కావలసి ఉంటుంది. ఉదాహరణ మందు ను ప్రోత్సయించే వాడు నీకు విరోదియా స్నేహితుడా? అల్లరిని ప్రోత్సయించేవాడు నీకు స్నేహితుడా, విరోదా? చదువు కోవలసిన సమయాన్ని సినిమాలకు, షికారులకు నిన్ను ప్రోత్సయించే వాడు నీకు స్నేహితుడా విరోదా? భవిష్యత్ లో నష్టాన్ని, కష్టాన్ని, అగౌరవాన్ని తెచ్చే వాటికై ప్రోత్సహించే వాడు నీకు శత్రువు, భవిష్యత్ లో నీకు మేలు, లాభం, విలువ తెచ్చే విషయాలలో ప్రోత్సయించే వాడు నిమయిన స్నేహితుడు., సమాజంలో ఎలా బ్రతికితే విలువ ఉంటుందో చెప్పేవాడు ఒకడు ఉంటాడు. నీవు తప్పు పై తప్పు లు చేస్తున్నా నిన్ను వెన్నంటి ఉండి నిన్ను ఒక మంచి స్థితిలో చూడాలని అసపడుతూ నీకోసం పరితపించే వాడే నీకు నిజమయిన స్నేహితుడు వానిని వదలకు జీవితం లో చాలా కోల్పోతావు...... అయితే నీవు నీ స్నేహితునికి ఎలాంటి స్నేహితుడవు ? నీవు మంచి స్నేహితునిగా ఉండి మంచి స్నేహితుని కలిగి ఉందువు గాక!
షలోమ్
మీకోరకు ప్రార్ధించే
అపోస్తులు నెల్లి నాని బాబు