మనకు బలహీనతలు రావొచ్చు .. అయితే ఆ బలహీనతలు 4 రకాలుగా ఉంటాయి. ఒకటి మనం తినే ఆహార లోపం వలన కలుగ వచ్చు. మన శరీరం ఒక ఇంజెన్ లాంటిది. మన శరీరం అనేక రసాయనాల సమ్మేళనం. అయితే అందులో ఏవిధమయిన సమతుల్యత లోపించిన అది అనారోగ్యానికి దారి తియ్యొచ్చు. ఆ రసాయనాలు అన్ని సమతుల్యంగా ఉండాలి అంటే అవి ఉత్పన్నం కావడానికి అవసరమయిన ఆహారాన్ని మనం తీసుకుంటూ ఉండాలి. అందుకే మనం వాడె బిళ్ళలు అన్ని కూడా విటమిన్, మినరల్, డ్రగ్ తో కూడుకున్నవి. అవి మన శరీరంలో ఏదైతే లోటుగా ఉందో దానికి ప్రత్యమ్నాయంగా వాడతాం.. అందుకే మనం తినే ఆహరం శరీరము కోసం తినాలి. మనం నాలుకకు రుచిగా ఉంటె తినేస్తాం అంతే గాని పొట్టకోసం తినము. కాబట్టి మనం తినే ఆహారం ఆరోగ్యకరమయినది తినాలి. అలా కాదు అంటే శరీరం బలహీన పడుతుంది. మనం మనకు ఇష్టం వచ్చినవి తింటూ.. దేవుని మీద నింద వేయడం సరి అయినది కాదు. అందుకే వాక్యం చెపుతుంది యెషయ 55:2 ఆహారము కాని దాని కొరకు మీరెలా రుకలిచ్చేద్దరు? సంతుష్టి కలుగాజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచేధరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్ధము భుజించుడి. మీ ప్రాణము సారమైనదానియందు సుఖింప నియ్యుడి.. ఆదాము మొదలుకుని నవాహు వరకు 90౦ సంవత్సరాలకంటే ఎక్కువ బ్రతికారు. కాని తరువాత అది తగ్గుకుంటూ వచ్చేసింది. కారణం ఆహారంలోని మార్పు కారణం. నవాహు నుండి మద్యం, మాంసాహారం అలవాటు అయ్యింది అది ఆరోగ్యాన్ని క్షినింప జేసింది. ఎందుకు నీవు నీ అయుస్శును తగ్గించుకునే పని చేస్తావు. దేవుడు నిన్ను దీవించి స్వస్త పరచును గాక!
షలోమ్
మీ కొరకు ప్రార్ధించు,
అపోస్తులు నెల్లి నాని బాబు