ఈరోజు దేవుని స్తుతించావా? ప్రతి క్షణం మనం స్తుతించుట వలన మన ప్రభువు మనతో నివాసముంటాడు అని నేర్చుకున్నాము. అయితే స్తుతించుట వలన 2 విషయాలు జరుగుతాయి. మొదటిది స్తుతి వలన విడుదల కలుగుతుంది. అపోస్తులు 16: 25 లో పౌలు, సీల లు పాటలు పాడుతూ , ప్రార్ధించుట ద్వారా చెరసాల పునాదులు అదిరి అందరి బంధకములు ఊడేను. అంతేకాదు చెరసాల నాయకుని కుటుంబపు ఆత్మీయ బంధకములు కుడా తెగిపోయి రక్షణ పొందెను. నీవు కుటుంబముగా స్తుతించుట వలన నీ కుటుంబపు బంధకాలు తెగి పడిపోతాయి. విడుదల కలుగుతుంది. రెండవది విజయం, ఇస్రయేలియులు యేరికో గోడ వద్ద ప్రభువును స్తుతించుట వలన గోడ పగిలి విజయం పొందిరి, ఎతైనది, బలమయినది, మనుషుల వలన గెలువలేనిది స్తుతివలన ఒడి పోయింది. యెహోషపాతు సైన్యానికి ముందు స్తుతించే వారిని పెట్టి యుద్ధమునకు వెళ్ళినప్పుడు శత్రువు మీద విజయం పొంద గలిగారు. ఈరోజు నీ శత్రువు ఎంతటి బలమైన వాడైన, ఎతైన వాడైన, నీ శక్తికి మించిన వాడైన విజయం నీదే.... స్తుతించుట మరచి పోకు... వాక్యం చెపుతుంది కీర్తనలు 92:1 యెహోవాను స్తుతించుట మంచిది. బైబిల్ మంచిది అని చెప్పింది అంటే అది ముమ్మాటికి మంచిదే.... ప్రభువు నిన్ను విడుదల చేసి, విజయం చేకుర్చును గాకా !
షలోమ్
మీకోరకు ప్రార్ధించే
అపోస్తులు నెల్లి నాని బాబు