The Word Today కుటుంబాలలో భార్య బర్త మధ్య అనేక ప్రతికూల, అనుకూల, అంగీకార, అనంగికార ఆలోచనలు, నిర్ణయాలు ఉంటాయి. అలా అని వారు ఒకటి కాక పోరు. కాని కొన్ని కుటుంబాలలో ఇలాంటివి వారి సుఖ సంసారం, దాంపత్య జీవితానికి ఆటంకంగా ఉంటాయి. కొన్ని కుటుంబాలలో బర్త భార్య గురుంచి, భార్య భర్త గురుంచి చెపుతూ " హింస" బారించ లేక పోతున్నాను, అని వాపోతుంటారు. నేను గమనించిన చాల కుటుంబాలలో " హింస " అనే పదానికి ఒకే ఒక నిర్వచనం ఏంటి అంటే... ఎవరికీ ఇష్టం వచ్చినట్లు వారిని ఉండనివ్వక పోవడం. ఉదాహరణకు మధ్యం తాగే వానికి హింస ఏంటి అంటే, తన భార్య వానికి మధ్యం దొరక కుండ చెయ్యడం, మద్యానికి వెళ్ళే దారులు ముసేయ్యడం, మద్యం తాగి వస్తే ఎందుకు తాగి వచ్చావు అని సతాయించడం. అంటే భార్యకు ఇష్టం లేని పని చెయ్యడం వలన భార్య ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు అని దానిని హింస అని పేరు పెట్టుకుని దానిని తప్పించుకోడానికి అనేక దారులు నేతుకుంటూ హింసను పెంచుకుంటూ తాను హింసకునిగా మారిపోవడం. దాని వలన ఇద్దరిలోను మనస్సు ప్రసంతతా కరువయ్యి కాపురాలు ఇసుక గట్టు వలె కూలిపోవడం జరిగిపోతుంది. ఒక్కసారి నీవు వివాహము చేసుకున్నావు అంటే నీ జీవిత సగ బాగం నీ బాగాస్వామికి ఇచ్చేసినట్టే, నీ మీద నీకు అధికారం లేదు ఇక నీ జీవిత భాగస్వామిదే. ( 1 కొరింది 7: 4 ). అంటే నీ దాంపత్యం సజావుగా సాగాలి అంటే నీ భాఘస్వామి కోసం రాజి పడటం, ప్రవర్తన ను మార్చుకోవడం, ఒకరి ఆలోచనలను ఒకరు గౌరవించుకోవడం, భాగస్వామికి నచ్చని పనిని విడిచి పెట్టడం, లాంటివి ముక్యం. నీ జీవితంలో ఎందరో ఎదురౌతారు, వెళ్ళిపోతారు, కాని నీవు చివరి శ్వాస విడిచి పెట్టె వరకు నీతో కలసి ఉండాల్సింది నీ జీవిత భాగస్వామి. అలంటి జీతాన్ని చిన్న చిన్న వాటికొరకు పాడుచేసుకుంటావా? ఇంటికి వెళ్తే హింస కాదు హంస లా ఉండాలి జీవితం అదే ప్రభువు వారు కోరుకున్న కుటుంబం. మీ కుటుంబంలో మన దేవుడు సంతోషాన్ని నింపును గాక మీ సహోదరుడు, అపోస్తులు నాని బాబు నెల్లి 7989 744 799 The Word Today నేను ఈరోజు ధ్యాన వాక్యం వ్రాయాలని ప్రార్ధిస్తే ప్రభువు నా చేతిలో 200 నోట్ పెట్టారు. ప్రభువును స్తుతిస్తూ నోటును పరిసిలించాను. ఇంతలో క్రింద కొన్ని కాగితపు ముక్కలు కనిపించాయి. అవి ఇవి ఒక్కటే కదా? వాటిని పారేసాము కాని దినిని పారేయ్యలేదు? పారేయ్యము కుడా? ఎందుకు ఇంత వ్యత్యాసము అని ఆలోచిస్తే క్రింద ఉన్న కాగితాల కంటే నోటు కాగితం విలువైనది అని అని పించింది. సరి ఇవి ధనం కాబట్టి దానికి ఆ విలువ వచ్చింది. ఓకే.... మరల నా ఆలోచన ఇంకొంచెం ముందుకు వెళ్ళింది. ఇదే రూపం లో ఉన్న వేరే కాగితానికి కుడా ఇంత విలువ ఇవ్వం కదా? అంటే పిల్లలు ఆడుకోడానికి ఇచ్చే డబ్బులు రూపం లో ఉండే కాగితాలు. అంటే దీనికి ఒక ప్రత్యకత ఉంది. ఏంటి? దిని ముద్రణ వేరు, తయారి విధానం వేరు, దానికి ఇవ్వబడిన రూపం వేరు. అదే దానిని అంత ప్రత్యేకంగా నిలువ బెట్టింది. అందులో ఒక మాట ఈరోజుకు... అసలు నోటులో రెండు గాంధీ బొమ్మలు ఉంటాయి, ఒకటి కనపడేది, రెండు కనపడనిది. . ఇమిటేషన్ నోటులో ఒక్కటే ఉంటుంది. పైకి కనపడే బొమ్మను చూసి, మరల లోపల వేరే బొమ్మ ఉందా అని చూస్తాం. అప్పుడు దానికి విలువ. అయితే బయట గాంధీ గారి బొమ్మ ఉండి లోపల వేరే వారి బొమ్మ ఉన్నా అది చెల్లదు. బయట లోపల ఒకటే ఉండాలి. అప్పుడు దానికి విలువ. నోటులో రెండు ఒకే రూపం ఉంటాయి మనిషిలో బయట రూపం లోపలి రూపం వేరుగా ఉంటాయి కాబట్టి మనిషి కంటే నోటుకే ఎక్కువ విలువ ఉంది సమజం లో. నిన్ను సృజించ వానిని నీవు కలిగి ఉంటె కనిపించడానికి, అంతరంగము లో నీకు మరింత విలువ, ఘనత కలుగుతుంది. దయతో ఈ వచనాలు చదువు యాకోబు ౩:17, 1 యోహాను 4:20,1 పేతురు 2:16, లుకా 6:46, మార్కు 7:6 ,తీతు 1:6 , దేవుడు నీకు నిర్ణయించిన విలువ ఘనత పొందుకుంధువు గాక, అపోస్తులు నాని బాబు నెల్లి, 7989 744 799 The Word Today యేసు వారు ఒక రోజు యూదయ ప్రాంతాన్ని దర్శించడానికి వెళ్తే అక్కడికి జనాలు సమూహాలుగా యేసు వారి దగ్గరకు వచ్చారు. అక్కడే అని కాదు ఎక్కడికి వెళ్ళిన భహు జన సమూహములు యేసు వారి దగ్గరకు వచ్చేవారు. యేసు వారి దగ్గరకు నాలుగు రకాలైన జనాలు వచ్చే వారు. 1) స్వస్తతలు కోసం, మేలు కోరి వచ్చే వారు, 2) యేసు వారు చేసే కార్యాలు చూడటానికి వచ్చేవారు ౩) యేసు వారిని ప్రశ్నించి తప్పు పట్టుకోడానికి వచ్చేవారు 4) యేసువారిని అర్ధం చేసుకుని నిజముగా యేసును వెంబడించే వారు. అయితే చాల తక్కువ సార్లు పిల్లల ప్రస్తావన ఉంది. మార్కు 10: 13 లో కొంతమంది తమ పిల్లలను యేసు వారి దగ్గరకు తీసుకుని వచ్చారు. ఎందుకు వారు తీసుకుని వచ్చారు. మిగతా వారు తీసుకుని రాలేదు. వారి ఆలోచన లో తమ తరువాతి తరం కుడా అసిర్వదించ బడాలని కోరిక కలిగింది. చిన్న నాటి నుండే వారిని యేసు చెంతకు రావడం నేర్పుతున్నారు. వారి కి నడువ వలసిన త్రోవను నేర్పుతున్నారు. యేసు వారు వారిని ఎత్తుకుని కౌగలించుకుని వారి మీద చేతులు ఉంచి ఆసిర్వధించెను. ఈ రోజు నీ పిల్లల పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచించుధామా ? ప్రభువు మీ పిల్లలును ఆసిర్వాధించును గాక! షలోమ్ మీ బిడ్డల క్షేమం కోరి ప్రార్ధించే అపోస్తులు నాని బాబు నెల్లి The Word Today ఈరోజు ఒక సవాలు మీకు... అసలు క్రీస్తుకు హృదయం లో స్థానం ఇచ్చారా... క్రీస్తుకు హృదయం లో స్థానం ఇస్తే క్రైస్తవుని జీవితం లో జరిగే కొన్ని మార్పులలో రెండు మీకు గుర్తు చేస్తాను. లూకా 19 వ అధ్యాయం లో ఒక పన్నులు వసూలు చేసే అధికారి, బాగా ధనవంతుడు యేసును చూడాలని తన ధన గర్వం, అధికార మదం పక్కన పెట్టి ఒక సామాన్య మానవునిగా చెట్టు ఎక్కాడు. నీవు దేవుని కొరకు ఎంత తగ్గించు కుంటున్నావు. దేవుని దగ్గరకు రావడానికి నీకు అడ్డు వస్తున్న గర్వం, అధికారం, ధనం మొదలైన వాటిని వదిలి రాగలవ... జక్కయ లా దీన మనస్సు ధరించు కోగలవా.. రెండు యేసు ఇంటికి వచ్చే సమయంలో యేసు వారు ఏమి చెప్పకుండానే.... తన ఆస్తిని ఏవిధమైన తారతమ్యాలు లేకుండా బీదలకు ఇవ్వడానికి ఇష్టపడ్డాడు, తీసుకున్న అన్యాయపు సొమ్మును తిరిగి 4 వంతులు కలిపి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాడు. అన్యాయముగా సంపాదించు ధనమును అసహించు కున్నాడు. మరి నీవు యాకోబు 1:27 లో చెప్పినట్టు నిష్కలంక మయిన బక్తి చెయ్యగలుగు తున్నవా .. అన్యాయపు సొమ్మును వదులుకోగలుగుతున్నవా ?... యేసు వారు ఇంటికి రాకుండానే జక్కయ్య లో మార్పు వచ్చింది... నీవు ఎన్ని రోజుల నుండి క్రైస్తవుడవు? ఇప్పటికైనా నిజ బక్తిని కలిగి ఈలోకసంబంధమయిన వాటిని త్యజించి యేసువారి నిజ శిష్యునిగా జీవించు.... షలోమ్ మీ కొరకు ప్రార్ధించే., అపోస్తులు నాని బాబు నెల్లి. The Word Today ప్రతి రోజు మనం మన సరిర ధృడత్వం కొరకు వ్యాయామం చేస్తుంటాం కదా మరి నీ ఆత్మీయ ధృడత్వం, అభివృధి కొరకు ఆత్మీయ వ్యాయామం చేయవా.... ఆత్మీయ వ్యాయామాలు రోజుకు ఒకటి చొప్పున ఇక్కడ మీకు అందిస్తాను. వాటిని ఆచరించి చుడండి.. మీలో గొప్ప మార్పు కనపడుతుంది. భూమి మీద రెండు జంతువులు మనకు ఒక చిన్న పాటాన్ని తెలియ పరుస్తాయి. అందులో ఒకటి కోడి తను తినిన ప్రతి సారి, గుటక వేసిన ప్రతిసారి పైకి చూస్తుంది. అంటే తను కలిగివున్న అంతయు దేవుడిచ్చినదే అని ఆకాసమందున్న దేవుని స్తుతిస్తుంది. అదే మరియొక జీవి ఉంది. అది ఎప్పటికి ఆకాశమువైపు కనులెత్తి చూడనే చూడదు... తను ఎప్పుడు క్రింద ఉన్న వాటినే చూసుకుంటూ నేతుకుకుంటు ఉంటుంది. మరణం వచ్చినప్పడు మాత్రమె పైకి చూసి ఏడుస్తుంది. మానవుడు కూడా దేవుడు ఎన్ని ఇచ్చినా వాటిని వెతుకు కుంటూ, ఇంకా ఏదో కావాలి అంటూ భుసంబంధమయిన వాటి మీదనే మనసును పెడుతున్నాడు గాని అసలు ఇప్పటి వరకు దేవుడుఇచ్చిన వాటి కొరకై ఆయనకు స్తుతి చెల్లించ లేకపోతున్నాడు. కీర్తనలు 1451 అనుదినము నేను నిన్ను స్తుతించేదను. 92:1 లో యెహోవాను స్తుతించుట మంచిది. అని దావీదు తన ఆత్మీయ ఎదుగుదలకు, దేవుని హృధయానుసారుడుగా పిలువ బడుటకు తను చేసిన పనిని మనకు ఇస్తున్నాడు. స్తుతించుట వలన దేవునికి సింహాసనం వేయ గలుగుతాము. ఇప్పటి వరకు దేవుడు ఇచ్చిన ప్రతి వాటి కొరకై ప్రభువును స్తుతించు. ఇరోజంత స్తుతించటం మాత్రమే చెయ్యండి.... నోటితో, క్రియలతో, అర్పనలతో స్తుతించుట అలవాటు చేసుకోండి... షలోమ్ మీ కొరకు ప్రార్ధించే అపోస్తులు నాని బాబు నెల్లి 990 882 3196 The Word Today
చాల పర్యాయాలు కొబ్బరి చెట్టును పాతి మామిడికాయలు కోసం ఎదురు చూస్తున్నట్టు మనం మంచి ఫలితాల కోసం ఎదురుచూస్తుంటాము. దేవుని వాక్యం చెపుతుంది నీవు ఏమి విత్తవో అదే కోస్తావు అని. యేసువారు స్వయంగా మనవ జీవిత యాత్రలో సమాజంలో మనం ఎలా బ్రతకాలో మనకు నేర్పుతూ లూకా 6:31 మనుషులు మీకేలాగు చేయవలెనని మీరు కోరుదురో ఆలాగు మీరును వారికి చేయుడి. ఇది మనలను మన మనసులను సృజించిన సృష్టికర్త మాట.. నీవు ఇతరుల నుండి ప్రేమను కోరితే ప్రేమను పంచు, ఇతరులు నీకు సహాయం చెయ్యాలని నీవు కోరుకుంటే నీవు సహాయాన్ని చెయ్యి,గౌరవం కావాలా గౌరవాన్ని ఇవ్వు. ఇతరులు నుండి నీవు ఇది కోరుకుంటే అది ముందు నీవే చెయ్యాలి. మన జీవితానికి వాక్యం ఒక మాన్యువల్ లాంటిది. న్యాయాధిపతులు 1:7 లో నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతి ఫలమిచ్చెను అని అధొనీ బెజెకు రాజు అంటున్నాడు. ఈరోజు నీ మనస్సు, మాట, విధానం మార్చుకుని బ్రతుకడం ప్రవర్తించడం మొదలు పెడతావా... ప్రభువు నిన్ను దీవించును గాకా ! షలోమ్ మీకొరకుప్రార్ధించే అపోస్తులునెల్లినానిబాబు The Word Today
చాల పర్యాయాలు కొబ్బరి చెట్టును పాతి మామిడికాయలు కోసం ఎదురు చూస్తున్నట్టు మనం మంచి ఫలితాల కోసం ఎదురుచూస్తుంటాము. దేవుని వాక్యం చెపుతుంది నీవు ఏమి విత్తవో అదే కోస్తావు అని. యేసువారు స్వయంగా మనవ జీవిత యాత్రలో సమాజంలో మనం ఎలా బ్రతకాలో మనకు నేర్పుతూ లూకా 6:31 మనుషులు మీకేలాగు చేయవలెనని మీరు కోరుదురో ఆలాగు మీరును వారికి చేయుడి. ఇది మనలను మన మనసులను సృజించిన సృష్టికర్త మాట.. నీవు ఇతరుల నుండి ప్రేమను కోరితే ప్రేమను పంచు, ఇతరులు నీకు సహాయం చెయ్యాలని నీవు కోరుకుంటే నీవు సహాయాన్ని చెయ్యి,గౌరవం కావాలా గౌరవాన్ని ఇవ్వు. ఇతరులు నుండి నీవు ఇది కోరుకుంటే అది ముందు నీవే చెయ్యాలి. మన జీవితానికి వాక్యం ఒక మాన్యువల్ లాంటిది. న్యాయాధిపతులు 1:7 లో నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతి ఫలమిచ్చెను అని అధొనీ బెజెకు రాజు అంటున్నాడు. ఈరోజు నీ మనస్సు, మాట, విధానం మార్చుకుని బ్రతుకడం ప్రవర్తించడం మొదలు పెడతావా... ప్రభువు నిన్ను దీవించును గాకా ! షలోమ్ మీకొరకుప్రార్ధించే అపోస్తులునెల్లినానిబాబు |
Apostle Naniఇందులో వ్రాయబడిన ప్రతి అంశము దేవుని దాసులు అపోస్తులు నాని బాబు గారి ధ్యానం లో ప్రభువు వారు చుపించనవే. ఆత్మల పట్ల భారం, పిలుపుకు విధేయత, ప్రార్ధన అనుభవం, అనుక్షణం వాక్య ధ్యానమే ఉపిరిగా, సంఘ క్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న సేవకులు. దేవుడు తనకు అప్పగించిన వారిని నిర్దోషులుగా ప్రభువు చెంత నిలబెట్టాలనే తాపత్రయం తో ఉన్న సేవకులు. Archives
December 2019
Categories
All
Click to set custom HTML
|
|