ప్రియ సహోదరి సహోదరుడ, మానవుడు ఈ భూమి మీద దేవునిచే పంపబడిన ఒక నాటక పాత్రదరుడు. నాటికలో పాత్రలు రచయిత ఇష్ట అయిష్టాల మీద ఆధారపడి ఉంటాయి. నీవు ఎలాంటి పాత్ర పోషిస్తున్నవో అది నీకు దేవుడు ఇచ్చింది. నీకు నిర్ణయించిన పాత్రకు నీవు న్యాయం చెయ్యాలి. ఉదాహరణకు ప్రతి ఇంటిలో పాత్రలు ఉంటాయి. అన్ని పాత్రలు ఒకేలా ఉండవు, ఒకే పనిని చెయ్యలేవు, కాని అవన్నీ కలసి పని చేస్తేనే యజమానుని పని పూర్తి అవుతింది ( రోమా 10:20, 14:8 Rom ).. నేను ఎందుకు ఇలా ఉన్నాను? నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? నేనే శ్రమ పడాల? అన్ని నేనే చెయ్యలా? నేను ఎందుకు అందరిలా లేను? నాకెందుకు ఈ లోపం? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం, నీవు ఎవరితో అయితే నీన్ను పోల్చుకుంటున్నవో వారు చూడటానికి నేకంటే గొప్పవారిగా, ధనికులుగా, అందంగా కనపడవచ్చు కాని దేవుని దృష్టిలో అతను/ ఆమె ఒక పాత్ర. వారి కంటే నీవు ఏమాత్రం తక్కువ కాదు. వారికి ఇవ్వబడిన పాత్ర అది, నీకు ఇవ్వబడిన పాత్ర ఇది. సేవలో ఉన్నావా? వారిది గొప్ప సేవ నాది చిన్న సేవ అనే భావం వద్దు, నీకు దేవుడు నిర్ణయించిన పాత్రను నమ్మకంగా పోషించు, నిన్ను దేవుడు నిర్ణయించిన పాత్రగా చూడలేని వానిని చూసి ఒక నవ్వు నవ్వి వదిలేయ్.. వానిని పట్టించుకోకు నీ పాత్ర కు న్యాయం చెయ్యలేవు. నీవు చేయాల్సిన పాత్ర ఎప్పుడైతే నీవు సరిగా చెయ్యగలుగుతావో అప్పుడే మొదలవుతాయి భహుమానాల పంట. ప్రతి ఒక్కరి మీద ఆయనకు ఉన్నత మయిన ఆలోచన కలిగి ఉన్నారు. పని ఇచ్చిన వాడు ఆ పనిని చెయ్యడానికి వనరులను ఇస్తారు. ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేక తలంతులు ప్రభువు ఇస్తారు. నీవు కూడా ఒక ప్రత్యేక తలంతు గలవాడవు. భీదలు ధనికులు కాగలరు ( కీర్తనలు 113: 7,8 ) , అవిటి వారు ఘన కార్యాలు చెయ్యగలరు .... నడవలేని వాడు ఆకాశానికి ఎగురగలడు... వినలేని వాడు మార్గాన్ని చూపగలడు ...అందహినుడను అనుకున్నవారు సౌందర్య వంతులు కంటే సుందర కార్యాలు చెయ్యగలరు, సమజంలో చెరగని ముద్ర వెయ్యగలరు.... నీ స్థితిని చూసి ఆగిపోకు... లే .. లే.... దేవుడు నీకిచ్చిన పనిని నమ్మకంగా చెయ్యి, ఎవరికీ తెలుసు దాని తరువాత దేవుడు ఏమి దాచి ఉంచాడో... ఇక్కడే ఆగిపోయి అయ్యో దేవుడు ఎలా చేసాడు ఏంటి అనకు... నీ పని చెయ్యి... చూడు.. నేనే చేసి యున్నాను చంక పెట్టుకును వాడను నేనే. నిన్ను ఎత్తు కొనుచు రక్షించు వాడను నేనే. మరియు వారు పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు ( యెషయ 46 : 4b; 40:31 Isaiah ).
షలోం.
మీ కొరకు ప్రార్ధించే
అపొస్తులు నాని బాబు నెల్లి