The Word Today
నేను ఈరోజు ధ్యాన వాక్యం వ్రాయాలని ప్రార్ధిస్తే ప్రభువు నా చేతిలో 200 నోట్ పెట్టారు. ప్రభువును స్తుతిస్తూ నోటును పరిసిలించాను. ఇంతలో క్రింద కొన్ని కాగితపు ముక్కలు కనిపించాయి. అవి ఇవి ఒక్కటే కదా? వాటిని పారేసాము కాని దినిని పారేయ్యలేదు? పారేయ్యము కుడా? ఎందుకు ఇంత వ్యత్యాసము అని ఆలోచిస్తే క్రింద ఉన్న కాగితాల కంటే నోటు కాగితం విలువైనది అని అని పించింది. సరి ఇవి ధనం కాబట్టి దానికి ఆ విలువ వచ్చింది. ఓకే.... మరల నా ఆలోచన ఇంకొంచెం ముందుకు వెళ్ళింది. ఇదే రూపం లో ఉన్న వేరే కాగితానికి కుడా ఇంత విలువ ఇవ్వం కదా? అంటే పిల్లలు ఆడుకోడానికి ఇచ్చే డబ్బులు రూపం లో ఉండే కాగితాలు. అంటే దీనికి ఒక ప్రత్యకత ఉంది. ఏంటి? దిని ముద్రణ వేరు, తయారి విధానం వేరు, దానికి ఇవ్వబడిన రూపం వేరు. అదే దానిని అంత ప్రత్యేకంగా నిలువ బెట్టింది. అందులో ఒక మాట ఈరోజుకు... అసలు నోటులో రెండు గాంధీ బొమ్మలు ఉంటాయి, ఒకటి కనపడేది, రెండు కనపడనిది. . ఇమిటేషన్ నోటులో ఒక్కటే ఉంటుంది. పైకి కనపడే బొమ్మను చూసి, మరల లోపల వేరే బొమ్మ ఉందా అని చూస్తాం. అప్పుడు దానికి విలువ. అయితే బయట గాంధీ గారి బొమ్మ ఉండి లోపల వేరే వారి బొమ్మ ఉన్నా అది చెల్లదు. బయట లోపల ఒకటే ఉండాలి. అప్పుడు దానికి విలువ. నోటులో రెండు ఒకే రూపం ఉంటాయి మనిషిలో బయట రూపం లోపలి రూపం వేరుగా ఉంటాయి కాబట్టి మనిషి కంటే నోటుకే ఎక్కువ విలువ ఉంది సమజం లో. నిన్ను సృజించ వానిని నీవు కలిగి ఉంటె కనిపించడానికి, అంతరంగము లో నీకు మరింత విలువ, ఘనత కలుగుతుంది. దయతో ఈ వచనాలు చదువు యాకోబు ౩:17, 1 యోహాను 4:20,1 పేతురు 2:16, లుకా 6:46, మార్కు 7:6 ,తీతు 1:6 ,
దేవుడు నీకు నిర్ణయించిన విలువ ఘనత పొందుకుంధువు గాక,
అపోస్తులు నాని బాబు నెల్లి,
7989 744 799