The Word Today దేవుడు తన కృపను బట్టి ఒక కుమార్తెను ఇచ్చారు. తను ఇప్పుడు 4 వ తరగతి చదువుతుంది. తనలో మార్పు నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. ఎలా అంటే తనకు ఏమి చెప్ప కుండానే తను బంగారు ఆభరణాలను త్యజించించి, దేవున్ని మహిమ పరచింది. తనలో అంత మార్పు ఎలా వచ్చింది అని నేను గమనించాను. దీనికి చాలా సమయమే పట్టింది. కాని దేవునికి స్తోత్రంచివరికి జవాబు దొరికింది. మన ఆలోచనలు ఒకరినుండి ఒకరిని ప్రబావితం చేస్తాయి. అలాగే నా బార్య ఆలోచనలు నా కుమార్తెను ప్రభావితం చేసాయి. నా బార్య వివాహం అయ్యిన తరువాత కుడా కొన్ని నెలలు ఆభరణాలు ధరించారు. తనకు కుడా ఏనాడు నేను ఆభరణాలు తిసేయమని చెప్పలేదు. ఒకరోజు మేము ఒక సేవకుల సద్ధస్సుకు వెళ్ళాము. అక్కడ దైవజనులు చెప్పిన వాక్యం, అక్కడికి వచ్చిన అనేక మంది సేవకురాండ్రు వలన నా బార్య అలోసించడం మొదలు పెట్టి, బైబిల్ లో ఆభరణాలు గురుంచి ఏమి వ్రాయబడి ఉన్నాయో చదివి అర్ధం చేసుకుని. నాకు చెప్పకుండానే అబరణాలు త్యజించి వాటిని తిసి వేసారు. ఆ సమయంలో నా కుమార్తె తన గర్బంలో ఉంది. తల్లి చదివిన వాక్యం, విన్న వాక్యం, ఆలోచనలు గర్బంలోని బిడ్డ మీద ప్రబావం చూపించాయి. తను మాట్లడం వచ్చిన నాటి నుండి మెల్లగా అన్నింటిని తిసేసింది. అవును ప్రియ సహోదరి నీ ఆలోచనలు గర్బం లోని నీ బిడ్డను ప్రభావితం చేస్తాయి. నీవు ఏమి మాట్లాడుతున్నావు? ఏమి అలోసిస్తున్నావు? ఏమి వింటున్నావు? జాగ్రత్త సుమా నీ బిడ్ద జీవితం నీ మీదనే ఉంది. లూకా 1:15, గలతీ 1:15. ప్రభువు నీ బిడ్దలను దివించును గాక! ప్రభు సేవలో మీ సహోదరుడు అపోస్తులు నాని బాబు నెల్లి, |
Apostle Naniఇందులో వ్రాయబడిన ప్రతి అంశము దేవుని దాసులు అపోస్తులు నాని బాబు గారి ధ్యానం లో ప్రభువు వారు చుపించనవే. ఆత్మల పట్ల భారం, పిలుపుకు విధేయత, ప్రార్ధన అనుభవం, అనుక్షణం వాక్య ధ్యానమే ఉపిరిగా, సంఘ క్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న సేవకులు. దేవుడు తనకు అప్పగించిన వారిని నిర్దోషులుగా ప్రభువు చెంత నిలబెట్టాలనే తాపత్రయం తో ఉన్న సేవకులు. Archives
December 2019
Categories
All
Click to set custom HTML
|
|