The Word Today: ఈరోజు మందిరానికి వెళ్ళడానికి సిద్ధ పడుతున్నారా? చాల మంచి పని చేస్తున్నారు. అయితే మందిరానికి ఎలా వెళ్ళాలి అనే ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. దేవుడు నిలిచి ఉండు స్థలమునకు మనం వెళ్తున్నాము. ఇశ్రాయేలియులు ఐగుప్తు నుండి కానా యాత్రలో సైన్యములకు అధిపతి యగు యెహోవా వారితో ఉండుటకు ఒక పర్ణశాల కట్టమని మోషే కు ప్రభువు వారు సుసించారు. అయితే పర్ణశాల చుట్టూ ప్రాకారము తెరలతో కట్టబడింది. దానికి తూర్పుగా ప్రవేశ ద్వారము ఉంచబడింది. లోపలి వెళ్ళే ప్రవేశ ద్వారము కూడా వ్రేలాడుతున్న తెరలతో ఉంది. అయితే ద్వారానికి ప్రత్యేక ఏర్పాట్లు ఏమీలేవు కాని వ్రేలాడుతున్న తెరల గుండానే లోపలి వెళ్ళాలి. అయితే అలా వెళ్ళాలి అంటే ప్రతివారు వ్రేలాడుతున్న తెరను వంగుని తెరను లేపి వంగి వెళ్ళవలసి ఉండేది. అదే విధానం అందరికి, చిన్న, పెద్ద, ధనిక, పేద, బేధం లేదు. ఈరోజు నీవు వెళ్ళేది అయన నిలఛి ఉండే స్థలానికే, నీవు ధనికుడవు అయివుండవచ్చు, బిద వాడవు అయివుండవచ్చు, ఉద్యోగస్తుడవు అయివుండవచ్చు, నీవు ఎవరివైన పర్ణశాలలో దేవుని కలచుటకు దేవుడు నిర్ణయించిన మాదిరి దీనత్వం కలిగి, నీవు నిలిచి ఉండే స్థలము సర్వసృష్టి కథ నిలిచి ఉండే స్థలమని, ఆయన నీన్ను సృజించిన వాడని, నీకంటే అధికుడని, బలవంతుడని గమనించి జీవిస్తే నీకు దివేనకరముగా ఉంటుంది. సోలోమోను అంటాడు " నీవు దేవుని మందిరానికి పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రతగా చూచుకొనుము ప్రసంగి 5:1 " అయన తన సన్నిధిలో దీనులను లేవనేత్తువాడు, గర్విష్టులను అనగ ద్రొక్కు వాడు. మోషే దినత్వాన్ని కలిగి సాత్వికుడై ఉన్నాడు గనుకనే దేవుని చూడగలిగాడు. నీవును అటువంటి మనసు కలిగి దీవింప బడుధువు గాక! షలోమ్ మీకోరకు ప్రార్ధించే అపోస్తులు నెల్లి నాని బాబు ఈరోజు ఆరాధనలు : అంబేత్కర్ కాలని ఉదయం 10 గంటలకు,
నెల్లి వారి పేట మధ్యాహ్నం 12 గంటలకు సత్తమ్మ కాలని 3 గంటలకు స్వచ్చమయిన వాక్యం కొరకు, పరిశుద్ధాత్మ అబిషేకం కొరకు, రండి కలసి ప్రభువును అరాధించుధం. వివరాలకు 7989 744 799 THE WORD TODAY నాకు తెలిసిన ఒక సేవకుడు మంచి పాటలు వ్రాయ గలరు, పాడగలరు, వాక్యాన్ని బాగా వివరించగలరు, మంచి ప్రార్ధనా పరుడు, సేవా మనస్సు గలవాడు. 15 సంవత్సరాల క్రితం దేవుడు ఒక దర్శనాన్ని ఇచ్చారు, వెళ్ళాల్సిన స్థలం, అక్కడ సహకారుల పేర్లు, అక్కడ జరుగుతున్న సంఘటనలు చూపించారు. అయితే అయన వెళ్ళాడు, దేవుడు చూపించినట్టు అన్ని జరుగుతున్నాయి. దేవుడు చెప్పిన పేరు కలిగిన వ్యక్తి ఉన్నారు. కలిసారు. దర్శనాన్ని వారితో పంచుకున్నారు. వారు సంతోషించారు. వారి ప్రార్ధనా దేవుడు విన్నాడు అని సేవకున్ని ఆహ్వానించారు, చేర్చుకున్నారు, సంఘముగా కుడుకున్నారు. అయితే ఇయన తన సొంత స్థలములో ఉన్న సుఖానికి, సంతోషానికి, సౌకర్యానికి, అలవాటు పడి అభివృధి చెందిన సంఘాన్ని, వ్యాపారాన్ని వదలలేక మరల దేవుడు చూపించిన స్థలానికి వెళ్ళలేదు. అయితే కాలం గడచే కొలది సంఘం, వ్యాపారం, సంతోషం, సౌకర్యం తనని విడిచి పోవడం మొదలయ్యింది. అయిన వినలేదు చివరకు తన భార్య, పిల్లలు తనను కాని వానిగా చూడటం మొదలు పెట్టారు. పాటలు లేవు, వాక్యం లేదు, సమాధానం లేదు, అందరి చేతులలో మోసపోయాడు. అసలు దేవుడు నన్ను వదిలేసాడా అని అనిపించేంతగా మారిపోయింది జీవితం, అసలు విషయం గుర్తుకు వచ్చింది, దర్సనమునకు లోబడి తిరిగి వెళ్ళడానికి ప్రయత్నాలు చేసాడు దేవుడు వెంటనే కావలసిన ఏర్పాట్లు చెయ్యడం మొదలు పెట్టాడు. అనుకోని రీతిలో సహాయం అందడం మొదలయ్యింది. ప్రియ చెల్లి, తమ్ముడు,అన్నయ్యా, అక్క, నీజీవితం లో కూడా దేవుడు నన్ను వదిలేసాడ, అసలు దేవుడు ఉన్నాడా అని పించెంతగా సమస్యలలో ఉన్నావా? నీ జీవితం లో దేవుడు మౌనిగా ఉన్నాడు అని అనిపిస్తుందా? ఒక్కసారి అలోసించు నీవు దేవుని మాటకు అవిదేయతగా నడుస్తున్నవేమో, వాక్యం ద్వారా గద్దించినా దేవునికి కోపాన్ని తెచ్చే పనులు చేస్తునె ఉన్నవేమో? నీకు నచ్చిన మార్గంలో నడుస్తూ అదే దేవుని చిత్తం అనుకుంటూ ఉన్నవేమో? నీ ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం, పని, చదువు, వివాహం, దేవునికి ఇచ్చే విషయం లో, పరిచర్య లో మొదలైన దేనిలోనైన సరే దేవుని మాటకు లోబడ గలిగితే సాధారణ దీవేన నుండి అసాధారణ దీవెనను పొందగలవు, ఆశ్చర్యకరమైన సహాయం పొందగలవు. ఏదనగా నా మాటలు మీరు అంగీకరించినయెడల నేను మీకు దేవుడనై యుందును మీరు నాకు జనులై యుందురు; మీకు క్షేమము కలుగునట్లు నేను మీకాజ్ఞా పించుచున్న మార్గమంతటియందు మీరు నడుచుకొనుడి. యిర్మియా 7:23 Jeremiah; నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును. సామెతలు 3:6 Proverbs . పిలచిన దేవుడు నమ్మదగిన వాడు. అయన నీజివితం లో ఉద్దేశించిన దీవెనలు నీవు అనుభవింతువు గాక ! నీ జీవితం లో ఏలుబడి చేస్తున్న శరీర క్రియలపై జయము పొందుదువు గాక! షలోమ్ . మీ కొరకు ప్రార్ధించే అపొస్తులు నాని బాబు నెల్లి pic from: |
Apostle Naniఇందులో వ్రాయబడిన ప్రతి అంశము దేవుని దాసులు అపోస్తులు నాని బాబు గారి ధ్యానం లో ప్రభువు వారు చుపించనవే. ఆత్మల పట్ల భారం, పిలుపుకు విధేయత, ప్రార్ధన అనుభవం, అనుక్షణం వాక్య ధ్యానమే ఉపిరిగా, సంఘ క్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న సేవకులు. దేవుడు తనకు అప్పగించిన వారిని నిర్దోషులుగా ప్రభువు చెంత నిలబెట్టాలనే తాపత్రయం తో ఉన్న సేవకులు. Archives
December 2019
Categories
All
Click to set custom HTML
|
|