ప్రియ సహోదరి, సహోదరుడా .... దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పముచొప్పున పిలువబడినవారికి, మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము. రోమ 8:28 Rom. సమకూడి జరగడం అంటే ఉదాహరణ కానా లో కరువు రావడానికి 13 సంవత్సరాల ముందే అది ఎరిగిన దేవుడు యోసేపు ను ఈజిప్ట్ కు పంపించి తన వాగ్ధాన పొందిన ప్రజలను కరువు నుండి కాపాడారు. ఎసేపుకు అది కష్టంగా ఉండి ఉండవచ్చు. కాని అది దేవుని చిత్తము. నీ జీవితం లో కూడా ఇప్పుడు శ్రమలు, కస్టాలు, శోధనలు, నష్టాలు, అవమానాలు, నిందలు అనుభావిస్తున్నవేమో అది రేపటి మేలు కొరకే అని గుర్తు పెట్టుకో. అయితే మనం దేవుని ప్రేమించే వారమై ఉండాలని పౌలు గారి హెచ్చరిక. మనం దేవుని ఎలా ప్రేమించగలం. ప్రార్ధనకు వెళ్ళడం, పాటలు పాడటం, I love you Jesus అని చెప్పడం కాదు ప్రేమంటే. ప్రేమకు కొలమానం క్రియ. నీ క్రియలు దేవుని మీద నీ ప్రేమను కనుపరచ గలగాలి. దేవుడు నిన్ను ప్రేమించాడు, తన కుమారుని నీకు బదులుగా మరణానికి అప్పగించారు. యోహాను 14 : 23 John యేసు ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, అయన ఆజ్ఞలను, మాటను బట్టి జీవించడమే దేవుని మీద నీ ప్రేమకు నిదర్శనం. ప్రభువా ప్రభువా అని పిలచు ప్రతి వాడు పరలోకమునకు చేరాడు. తండ్రి చిత్త ప్రకారమే చేయువాడే పరముకు చేరగలడు అని యేసు వారు చెప్పారు కదా.... నీ కోరికలు, ఆశలు, ఆలోచనలు, ప్రణాళికలు ప్రక్కన బెట్టి, నీ ఇష్టానికి అడ్డువచ్చినప్పటికి దేవుని మాటకు లోబడితేనే ప్రేమకు తగిన ఫలాలు ఆశించగలం. దేవుని నిత్య కృప నీకు తోడై ఉండును గాక! దేవుని సంకల్ప మహిమైస్వర్యము మీకు కలుగును గాకా !
షలోమ్
మీ కొరకు ప్రార్ధించే,
అపొస్తులు నాని బాబు నెల్లి,