దేవుని వాక్యం లో ఒక మాట 1 కొరింది ౩:17 ఎవడైనను దేవుని ఆలయమును పాడుచేసిన యెడల దేవుడు వానిని పాడు చేయును. వాక్యం లో ౩ రకాలైన ఆలయాలు ఉన్నాయి. మొదటిది కట్టబడిన ఆలయం, ఇటుక, ఇసుక, రాయి, సున్నం వంటి వాటితో కట్టబడినది. రెండవది సజీవమయిన ఆలయం. ఇది సంఘమంతయు కలసి సజీవమయిన రాళ్ళ వలె కట్టబడినది ( 1 పేతురు 2:5 ). ఇందులో ప్రతి విశ్వసి ఒక రాయిగా ఉండి కట్ట బడిన సంఘమే దేవునికి ఒక ఆలయం. మూడవది ప్రతి వ్యక్తి శరీరం దేవునికి ఒక ఆలయం, ( 1 కొరింది ౩:16 ). వీటిలో దేనినయినను, ఏవిధముగా నయినను, ఎవడైనను పాడు చేస్తే దేవుడు చూస్తూ ఊరుకుని ఉండడు. 2 దిన 33 వ అధ్యాయంలో మనషే దేవుని ఆలయాన్ని అపవిత్ర పరిచాడు, దేవుడు మనషే ను సింహాసనము నుండి చెరసాలకు తీసుకుని వెళ్ళాడు. తరువాత మారు మనస్సు పొంది తిరిగి సింహసంనాన్ని పొంది తిరిగి మందిరాన్ని కట్టడం, మందిరం లో ఉన్న చెడును తీసివేసి సుద్ధి చేయడం మొదలు పెట్టాడు. దీర్గకాలం సింహాసనం మీద ఉన్నాడు. అట్టి కృప ప్రభు మీకు దయచేయును గాక!
షలోమ్,
మీ కొరకు ప్రార్ధించే
అపోస్తులు నెల్లి నాని బాబు
1 Cor 3:17 says if any man defile the temple of God, him shall God destroy. there are three types of temples in Bible. first one is built by man. The temple built with bricks, sand, cement, or any other meterials. second one is a spiritual House. this house is built up with believer together as lively stones. we call it church. Third one is your Body. Every saved person's body is a temple of God. ( 1 Cor 3:16 ) . if any one, with any reason, by any means want to defile or destroy the HIS any temple, He will not say calm. In 2 Chro chapter 33, we will find a king named Manasseh. He defile the temple of God. And God was angry with him. Manasseh was brought up to a bondage from thrown, in lack instead of fullness. in shame instead of royal glory. God is not partial to any one. Manasseh was repented and his thrown given to him and he started working in and for temple of God. and he ruled long years in Israel. So May our heavenly father bless you as you love His temple, building, spiritual house, and your body.
shalom.
in prayers
apostle Nani Babu Nelli