The Word Today
కుటుంబాలలో భార్య బర్త మధ్య అనేక ప్రతికూల, అనుకూల, అంగీకార, అనంగికార ఆలోచనలు, నిర్ణయాలు ఉంటాయి. అలా అని వారు ఒకటి కాక పోరు. కాని కొన్ని కుటుంబాలలో ఇలాంటివి వారి సుఖ సంసారం, దాంపత్య జీవితానికి ఆటంకంగా ఉంటాయి. కొన్ని కుటుంబాలలో బర్త భార్య గురుంచి, భార్య భర్త గురుంచి చెపుతూ " హింస" బారించ లేక పోతున్నాను, అని వాపోతుంటారు. నేను గమనించిన చాల కుటుంబాలలో " హింస " అనే పదానికి ఒకే ఒక నిర్వచనం ఏంటి అంటే... ఎవరికీ ఇష్టం వచ్చినట్లు వారిని ఉండనివ్వక పోవడం. ఉదాహరణకు మధ్యం తాగే వానికి హింస ఏంటి అంటే, తన భార్య వానికి మధ్యం దొరక కుండ చెయ్యడం, మద్యానికి వెళ్ళే దారులు ముసేయ్యడం, మద్యం తాగి వస్తే ఎందుకు తాగి వచ్చావు అని సతాయించడం. అంటే భార్యకు ఇష్టం లేని పని చెయ్యడం వలన భార్య ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు అని దానిని హింస అని పేరు పెట్టుకుని దానిని తప్పించుకోడానికి అనేక దారులు నేతుకుంటూ హింసను పెంచుకుంటూ తాను హింసకునిగా మారిపోవడం. దాని వలన ఇద్దరిలోను మనస్సు ప్రసంతతా కరువయ్యి కాపురాలు ఇసుక గట్టు వలె కూలిపోవడం జరిగిపోతుంది. ఒక్కసారి నీవు వివాహము చేసుకున్నావు అంటే నీ జీవిత సగ బాగం నీ బాగాస్వామికి ఇచ్చేసినట్టే, నీ మీద నీకు అధికారం లేదు ఇక నీ జీవిత భాగస్వామిదే. ( 1 కొరింది 7: 4 ). అంటే నీ దాంపత్యం సజావుగా సాగాలి అంటే నీ భాఘస్వామి కోసం రాజి పడటం, ప్రవర్తన ను మార్చుకోవడం, ఒకరి ఆలోచనలను ఒకరు గౌరవించుకోవడం, భాగస్వామికి నచ్చని పనిని విడిచి పెట్టడం, లాంటివి ముక్యం. నీ జీవితంలో ఎందరో ఎదురౌతారు, వెళ్ళిపోతారు, కాని నీవు చివరి శ్వాస విడిచి పెట్టె వరకు నీతో కలసి ఉండాల్సింది నీ జీవిత భాగస్వామి. అలంటి జీతాన్ని చిన్న చిన్న వాటికొరకు పాడుచేసుకుంటావా? ఇంటికి వెళ్తే హింస కాదు హంస లా ఉండాలి జీవితం అదే ప్రభువు వారు కోరుకున్న కుటుంబం.
మీ కుటుంబంలో మన దేవుడు సంతోషాన్ని నింపును గాక
మీ సహోదరుడు,
అపోస్తులు నాని బాబు నెల్లి
7989 744 799