చిన్న వయస్సు స్మృతులు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. అంతే కాదు మనకు క్రొత్త విషయాలను నేర్పుతుంటాయి. అందులో బాగంగా మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తాను. చదువుకునే రోజుల్లో స్కూల్ లో చాల విషయాలు మనకు ఆనందాన్ని ఇస్తాయి. అందులో మాస్టారు వ్రాసిన బోర్డు చెరపడం అంటే ఎంతో సరదా. అలా ఒకవేళ అవకాసం వస్తే హిరో లా బావిస్తూ ఉండేవారు. మారలా మాస్టారు అలంటి అవకాసం ఎప్పుడు ఇస్తారా అని ఎదురు చూస్తూ ఆనందంగా రోజులు గడుపుతూ స్కూల్ వెళ్తూ జ్ఞానాన్ని సంపాదించుకున్నాం, ఈరోజు ఆ చదువు జీవితం లో నిలబడేటట్టు చేసింది. కాని వయసు పైబడిన తరువాత చెరపడం మీద ఆసక్తి తగ్గి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అప్పుడు బోర్డు చేరిపినట్టు నీ మనసు మీద వ్రాసుకున్న పాత వ్రాతలు, ఎవరో మీ జీవితం లో వ్రాసిన వ్రాతలు, నీకు స్నేహితులుగా నటిస్తూ మారు వేషం లో ఉన్న శత్రువు నీ జీవితం లో వ్రాసిన చెడు అలవాట్లు, చెడ్డ మాటల వ్రాతలు, అనుమానాలు అనే వ్రాతలు చేరుపుకుని బ్రతకగాలిగితే నీ జీవితం ముందుకు సాగుతుంది. ఆనంద మయంగా ఉంటుంది. దయతో హెబ్రీ 2:1,2 వచనాలు చదవండి.
మీకోరకు ప్రార్ధించే,
అపోస్తులు నాని బాబు నెల్లి