The Word Today
ఈరోజు ఉదయాన ధ్యాన సమయంలో ప్రభువు నాకు ఒక సూచనను ధర్సనంలో చూపించారు. ఆ దర్సనం లో ఒక క్రోవోత్తి వెలుగుతుంది, ఆ వెలుగుతున్న క్రోవోత్తి పక్కన మరో వెలుగుతున్న క్రోవోత్తిని కలిపారు. రెండు క్రోవోత్తుల అగ్ని కలిసి వెలుగుతుంది. కాసేపటికి మరొక వెలుగుతున్న కట్టే ఒకటి పట్టుకుని వచ్చి ముందు ఉన్న రెండు క్రోవోత్తుల తో కలిపి పెట్టారు. ఇప్పుడు ఈ నుండి వస్తున్న అగ్ని కలసి ప్రజ్వలిస్తుంది. ప్రభువా దీనిలోని భావం ఏంటి అని అడిగాను ప్రభువుని. నా మనస్సులో ప్రభువు దాని భావాన్ని ఉంచారు. క్రోవోత్తి, కట్టే సంఘంలో ఉన్న వివిధ సంఘాల విస్వాసులను సుచిస్తుంటే, అగ్ని పరిశుద్ధాత్మున్ని సూచిస్తుంది. సంఘములో ఉన్న ప్రతి విశ్వాసి కలిగియున్నది ఒకే ఆత్మ.ఒకే బాప్తిస్మాము, (ఎఫేసి 4:4 ) ఒక్కడే తండ్రి. అయితే క్రైస్తవ సహోదరులు కలిసినప్పుడు సంఘాలు వేరు కావొచ్చు, సిధాంతాలు కావొచ్చు, మంట ఒకటిగా అయినట్లు మనలోని ఆత్మీయ జీవితం, ఆలోచన, ప్రేమ ఒకటి అవుతున్నాయా? లేక సంఘం వేరు, సిధాంతాలు వేరు అని వేరు వేరు గా ఉంటున్నారా? అసలు బైబిలు చెపుతున్న సత్యానికి దూరం గా దేవునికి దూరంగా ఉండిపోతున్నవా? ఇద్దరు క్రైస్తవులు కలసిన చోట గొప్ప శక్తీ ఉత్పన్నమవ్వాలి, అది అక్కడ ఉన్న సాతాను శక్తులను కాల్చగలగాలి, మనస్సులు మార్చబడలి, దేవుని రాజ్యం కట్టబడాలి. అట్టి ఐక్యత ప్రభువు ప్రతి క్రైస్తవులలో ఉండును గాకా!
షలోమ్
మీకోరకు ప్రార్ధించే
అపోస్తులు నెల్లి నాని బాబు