THE WORD TODAY:
ఒక రోజు నేను బయటకు వెళ్లి ఇంటికి దూరంగా ఉన్నాను... ఒక వ్యక్తికి నేను కొంతసొమ్ము ఇవ్వవలసి ఉంటె ఆరోజు ఇంటికి వచ్చారు. ఇంటినుండి ఫోన్ చేశారు. వెంటనే ఎంత ఇవ్వాలో చెప్పాను, నా భార్య దగ్గర లాకర్ తాళాలు వదిలి వ్హాచ్చాను. అలాగేనండి అని చెప్పి ఫోన్ పెట్టేసారు. మరల కాసేపు అయ్యాకా మరల ఫోన్ చేశారు. ఏంటి విషయం అని అడిగాను. అప్పుడు, అయ్యా నా దగ్గర బీరువా లాకర్ ( locker ) తాళాలు ఉన్నాయి గాని బీరువా తాళం ఎక్కడ పెట్టారు ఆని అడిగారు. వెనక్కి వెళ్లి ఆలోసించి గుర్తు చేసుకుంటే కంగారులో లాకర్ తాళాలు ఇచ్చి బీరువా తాళాలు నాతోనే తెచ్చేసుకున్నారు. అప్పుడు దేవుడు నా మదిలో ఒక ఆలోచన పుట్టించారు... నాతో అన్నారు అయన... ప్రస్తుత క్రైస్తవ విశ్వాసం, ప్రార్ధన ఇలానే ఉన్నాయి అని... ఆలోసించాను. అవును ప్రార్ధన ఒక పరలోకపు ధననిధి తాలపు చెవి వంటిది, దానిని కలిగిఉంటే అన్నింటిని పొందవచ్చు అని వింటూవుంటాం. అయితే దేవుడు నాతో అన్నారు... అందరి దగ్గర లాకర్ తాళాలు ఉన్నాయి కానీ ప్రవేశ ద్వారపు తలపు చెవులు లేవు అన్నారు. ఏంటి అయ్యా అని అడిగితే ప్రభువు వారు నాకు ఒక వాక్యాన్ని గుర్తుకు తెచ్చారు. యెషయా 59:1c మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చుచ్చెను. అని వ్రాసి ఉంది. నెహెమ్యా తన ప్రార్ధనలో మొదటి తలుపు తియ్యగలిగాడు, దావీదు తన మొదటి తలుపు తియ్య గలిగాడు. ఏంటి అది అంటే దేవునికిని నీకును మధ్యలో అడ్డుగా వస్తున్న పాపములు. వాటిని ఒప్పుకుని , విడిచి పెట్టి, ప్రార్ధిస్తే లోపలి ధననిద్ధి తాళాలు తెరవబడతాయి. ఆశీర్వాదమును ప్రార్ధన ఫలితాన్ని పొందగలుగు తావు. బయట తలుపు తాళాలు తియ్యకుండా లోపటి తాళాలు తియ్యలేవు. గనుక మారు మనస్సు పొందు... నీ పాపములు ఒప్పు... అప్ప్డుడు నీ ప్రార్థనకు ప్రతిఫలం దేరుకుతుంది. 1 యోహాను 3:22b 1 John మనమేమి అడిగినను అడిగినను అది అయన వలన మనకు దొరుకును. దేవుడు నీ ఆశను తీర్చి నీ ప్రార్థనకు పరాతిఫలం అనుగ్రహించునట్లుగా నీ హృదయము తెరవ బడును గాక!
( వీలైతే, మరొకరి ఆత్మీయ అభివృద్ధికి ఉపయోగ పడుతుంది అని మీకు అనిపిస్తే షేర్ చేయండి. )
మీ కొరకు ప్రార్ధించే
అపోస్తులు నెల్లి నాని బాబు