పాత మతాల స్థానం లోనికి క్రైస్తవ్యం వచ్చె క్రమంలో క్రైస్తవ్యం మతమై పోయింది. ( Alexander Schmemann, 20th century Eastern Orthodox Priest, teacher, and Writer ). క్రైస్తవ్యం మతానికి అతీతమయినది, మారడానికి ఇది వేరే మతం కాదు. పారసికుల, యూదుల పాలన సమయాలయిన రోమన్ కాతోలిక్ సంఘం రుపొందించబడిన 4-6 శతాబ్దాలలో క్రైస్తవ్యం లోనికి మతపరమయిన అలవాట్లు ప్రవేశించాయి. అప్పటి వరకు క్రైస్తవ్యం ఒక మార్గం, ఒక విశ్వాసం, నిరీక్షణ, ఐక్యత, ప్రేమ గా క్రీస్తే గురిగా ఉండేవారు. కాని ప్రస్తుత రోజుల్లో క్రైస్తవ్యం లోనికి వదిల వచ్చిన పాత మతాల అలవాట్లు కలగలిపి ఆరాధన చేస్తున్నారు. అందుకే ప్రభువు వారు చెపుతున్నారు యెషయ 29:13d వారు నాయెడల చూపు భయబక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకున్నవి. మత్తయి 15: 6 మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. దేనినుండి అయితే ప్రభువు మానవ జాతిని విడిపించారో మరల ఆ పిత్రు పారంపర ఆచారాలు, పద్ధతులు, క్రమాలు, కట్టుదిట్టమయిన కట్టుబాట్లు మరల సంఘం లోనికి మెల్లగా ప్రవేశించి మొత్తాన్ని అక్రమించేసుకున్నాయి. "గలతీ 5:1 ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి, క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసియున్నాడు. కాబట్టి, మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమను కాడి క్రింద చిక్కుకోనకుడి". ప్రియ సహోదరుడ ఈరోజు నీ క్రైస్తవ్యం ఎటువైపు క్రిస్తు వాలే నడచే క్రీస్తు వారసుడవా? ఆచారాల క్రైస్తవుడవా?
షలోమ్.
మీకోరకు ప్రార్ధించే
అపోస్తులు నెల్లి నాని బాబు T