మిత్రులందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు... అసలు స్వతంత్రం అంటే ఏమిటి? భానిసత్వము నుండి విముక్తి. 72 సంవత్సరాల క్రితం మనలను పాలించిన బ్రిటిష్ ప్రభుత్వము నుండి మనం రాజకీయ స్వతంత్రాన్ని పొందాము. అంటే మన మీద వేరే వారి పాలన నుండి విముక్తి. దేశానికి రాజకీయ స్వతంత్రం వచ్చింది కాని నీకు స్వతంత్రం వచ్చిందా... నీ మీద ఏలుబడి చేస్తున్న అప్పుల నుండి, రోగాల నుండి, వ్యసనాలు నుండి, మానసిక సమస్యల నుండి, అసమాధానం నుండి, సమస్యల నుండి, బలహీనతలు నుండి, మనలో ఉన్న మృగ తత్వం నుండి, ముర్ఖత్యం నుండి, చెడు పనులకు ప్రేరేపించే ధనాశ నుండి, ఆత్మ పాపము నుండి నీకు విముక్తి కలిగిందా? ఇదే కదా అసలైన విముక్తి. ఇవ్వే కదా మనిషిని మనిషిగా బ్రతక నివ్వడం లేదు. ఇవ్వే కదా మనిషిని బానిసలుగా చేసి జీవితాలను పాడు చేస్తున్నవి. వీటినుండి నుండే పొందే విముక్తే కదా అసలైన స్వతంత్రం. వ్యసనాలు వలన నష్టం, అనారోగ్యం అని తెలిసిన మనలేవు, ఎందుకంటే నీవు దానికి బానిసవు. మనలో పాపము ఏలుబడి చేస్తుంది. స్వతంత్ర భారత దేశం లో ఉన్నాము గాని మనం ఇంకా వ్యక్తిగత స్వతంత్రాన్ని పొందలేదు. వ్యక్తిగత స్వంత్రత ఎవ్వరు ఇవ్వలేరు. కాని దేవుని వాక్యం చెపుతుంది. సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును. యోహాను 8:32 John. సత్య మంటే ఏమిటో తెలుసా... నిజాము కంటే గొప్పది. నీకు కనపడేది నిజం అయ్యి ఉండవచ్చు కాని పరీక్షలో వీగి పోవచ్చు. కాని సత్యం ఎప్పటికి నిలచి ఉండేది. అందే యోహాను 14; 6 John లో యేసు వారు ఇలా అన్నారు, స్వయంగా తనకు తానే సాక్షాన్ని ఇస్తున్నారు. నేనే జీవము, సత్యము, జీవము. అసలైన సత్యం అయినే. యేసు వారే నీకు సమస్త వ్వక్తి గత బంధకాలనుంది విముక్తిని దయ చేయ గలరు. నీ ప్రతి బంధకము తెగి పదును గాక! నీ మీద ఏలుబడి చేస్తున్న ప్రతి చీకటి శక్తీ, యేసునామములో బంధింప బడును గాక! ఈ ఉదయమే వ్వక్తిగత స్వతంత్రం పొంధువు గాక!
షలోమ్
మీ కొరకు ప్రార్ధించే,
అపొస్తులు నాని బాబు నెల్లి,