The Word Today:
పిన్న వయసులో కస్టాలు, బాధ్యతలు నెత్తిన పడ్డాయి అని చింత పడుతున్నావా? చిన్న వయసులోనే మంచి వ్యాపారం మొదలు పెట్టి ఎదురయ్యే సమస్యలకు తట్టుకోలేక ఏమిచెయ్యాలో, ఎలా దినిని ముందుకు తీసుకుని వెళ్ళాలో తెలియక సలహాదారుల కొరకు ఎదురు చూస్తున్నార? ఒకసారి ఇది అలోసించండి. 16 సంవత్సరాల వయసులో రాజ్యాధికారం పొంది అందరికన్నా ఎక్కువ కాలం 52 యేళ్ళు ఏలుబడి చేసిన ఒక రాజు ఉన్నాడు. అతని పేరు ఉజ్జియ. తన రాజ్యానికి ఒక కొత్త పద్ధతులలో, నూతన ఒరవడిలో సుభిక్షంగా తన రాజ్యాన్ని పాలించా గలిగాడు. తనకు ఆశ్చర్యమైన సహాయం అందుతు ఉండేది. అతని కీర్తి దూర దేశాల వరకు వెళ్ళింది. అందుకు కారణం ఒకటి ఉంది. 2 దిన 26:5 " అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్దిల్ల చేసెను". యోవ్వనకాలం, జ్ఞానం తక్కువ గా ఉండే సమయం, నేర్చుకోనే వయస్సు గాని సింహాసనాన్ని పొందవలసి వచ్చింది, రాజ్యం లో అంతర్గత , బహిర్గత శత్రువులు, ఆర్ధిక విషయాలు, దౌష్ట విషయాలు, దేశ, స్వీయ రక్షణ ఇన్ని విషయాలలో యెహోవా దగ్గర నేర్చుకున్నాడు, జకర్య ఆత్మీయ నాయకత్వం లో నేర్చుకున్న ఆత్మీయ జీవితం అతన్ని గోప్పవానిని చేసింది. ఈరోజు దేవుని ఆశ్రయించ గలిగితే నీవును నీ పనిలో, వ్యాపారం లో, ఉద్యోగంలో అభివృధి సాధించగలవు. అట్టి ధన్యత ప్రభువు నీకు దయచేయును గాక! ప్రభువు కృప నీకు తోడై ఉండి నిన్ను వృద్ధి లోనికి తెచ్చును గాక!
షలోమ్
మీకోరకు ప్రార్ధించే
అపోస్తులు నెల్లి నాని బాబు