ఈరోజు నీవు నమ్మిన దేవుని శక్తీ బట్టి అడుగుతున్నావా? ఆయనను తక్కువగా ఉహించుకుంటూ చిన్న చిన్న వాటికోరకై వేగిర పడుతు, పెద్ద వాటిని అయన చెయ్యలేడు లే అనుకుంటూ అయన శక్తిని చులకనగా చూస్తున్నావా? ఎర్ర సముద్రం, యోర్దాను, ఏరికో, అగ్ని గుండం, సింహపు గుహ, ఎండిపోయిన గోయి, నూరు సంవత్సరాల వయసులో సంతానం, అరణ్యం లోనుండి అంతఃపురం ఇవన్ని గుర్తుకు తెచ్చుకో... ఆయనకు అసాధ్యమైనది లేదు... అయన చెయ్యలేనిది లేదు.... మార్కు 11:24 అందుచేత ప్రార్ధన చేయునప్పుడు మీరు అదుగుచున్న వాటినెల్లను పొందియున్నామని నమ్ముడి. అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను."
ప్రభువు మీకోరకు గొప్ప కార్యాలు చేయును గాక!
మీకోరకు ప్రార్ధించే
అపోస్తులు నెల్లి నాని బాబు