THE WORD TODAY
నాకు తెలిసిన ఒక సేవకుడు మంచి పాటలు వ్రాయ గలరు, పాడగలరు, వాక్యాన్ని బాగా వివరించగలరు, మంచి ప్రార్ధనా పరుడు, సేవా మనస్సు గలవాడు. 15 సంవత్సరాల క్రితం దేవుడు ఒక దర్శనాన్ని ఇచ్చారు, వెళ్ళాల్సిన స్థలం, అక్కడ సహకారుల పేర్లు, అక్కడ జరుగుతున్న సంఘటనలు చూపించారు. అయితే అయన వెళ్ళాడు, దేవుడు చూపించినట్టు అన్ని జరుగుతున్నాయి. దేవుడు చెప్పిన పేరు కలిగిన వ్యక్తి ఉన్నారు. కలిసారు. దర్శనాన్ని వారితో పంచుకున్నారు. వారు సంతోషించారు. వారి ప్రార్ధనా దేవుడు విన్నాడు అని సేవకున్ని ఆహ్వానించారు, చేర్చుకున్నారు, సంఘముగా కుడుకున్నారు. అయితే ఇయన తన సొంత స్థలములో ఉన్న సుఖానికి, సంతోషానికి, సౌకర్యానికి, అలవాటు పడి అభివృధి చెందిన సంఘాన్ని, వ్యాపారాన్ని వదలలేక మరల దేవుడు చూపించిన స్థలానికి వెళ్ళలేదు. అయితే కాలం గడచే కొలది సంఘం, వ్యాపారం, సంతోషం, సౌకర్యం తనని విడిచి పోవడం మొదలయ్యింది. అయిన వినలేదు చివరకు తన భార్య, పిల్లలు తనను కాని వానిగా చూడటం మొదలు పెట్టారు. పాటలు లేవు, వాక్యం లేదు, సమాధానం లేదు, అందరి చేతులలో మోసపోయాడు. అసలు దేవుడు నన్ను వదిలేసాడా అని అనిపించేంతగా మారిపోయింది జీవితం, అసలు విషయం గుర్తుకు వచ్చింది, దర్సనమునకు లోబడి తిరిగి వెళ్ళడానికి ప్రయత్నాలు చేసాడు దేవుడు వెంటనే కావలసిన ఏర్పాట్లు చెయ్యడం మొదలు పెట్టాడు. అనుకోని రీతిలో సహాయం అందడం మొదలయ్యింది. ప్రియ చెల్లి, తమ్ముడు,అన్నయ్యా, అక్క, నీజీవితం లో కూడా దేవుడు నన్ను వదిలేసాడ, అసలు దేవుడు ఉన్నాడా అని పించెంతగా సమస్యలలో ఉన్నావా? నీ జీవితం లో దేవుడు మౌనిగా ఉన్నాడు అని అనిపిస్తుందా? ఒక్కసారి అలోసించు నీవు దేవుని మాటకు అవిదేయతగా నడుస్తున్నవేమో, వాక్యం ద్వారా గద్దించినా దేవునికి కోపాన్ని తెచ్చే పనులు చేస్తునె ఉన్నవేమో? నీకు నచ్చిన మార్గంలో నడుస్తూ అదే దేవుని చిత్తం అనుకుంటూ ఉన్నవేమో? నీ ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం, పని, చదువు, వివాహం, దేవునికి ఇచ్చే విషయం లో, పరిచర్య లో మొదలైన దేనిలోనైన సరే దేవుని మాటకు లోబడ గలిగితే సాధారణ దీవేన నుండి అసాధారణ దీవెనను పొందగలవు, ఆశ్చర్యకరమైన సహాయం పొందగలవు. ఏదనగా నా మాటలు మీరు అంగీకరించినయెడల నేను మీకు దేవుడనై యుందును మీరు నాకు జనులై యుందురు; మీకు క్షేమము కలుగునట్లు నేను మీకాజ్ఞా పించుచున్న మార్గమంతటియందు మీరు నడుచుకొనుడి. యిర్మియా 7:23 Jeremiah; నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును. సామెతలు 3:6 Proverbs . పిలచిన దేవుడు నమ్మదగిన వాడు. అయన నీజివితం లో ఉద్దేశించిన దీవెనలు నీవు అనుభవింతువు గాక ! నీ జీవితం లో ఏలుబడి చేస్తున్న శరీర క్రియలపై జయము పొందుదువు గాక!
షలోమ్ .
మీ కొరకు ప్రార్ధించే
అపొస్తులు నాని బాబు నెల్లి
pic from: