ప్రియ సహోదరి, సహోదరుడా .... ఈరోజు ప్రభువు దినం, ఆరాధనకు వెళ్తున్నావు కదా! ఒక లేఖనాన్ని చదువుకుని బయలు దేరదం. తన దేవుని ఆశ్ర యించుటకై దేవుని మందిర సేవవిషయమందేమి ధర్మశాస్త్ర విషయమందేమి ధర్మమంతటివిషయమందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను. 2 దిన 31:21 2 Chro. హిజ్కియ వర్దిల్లాడు. ఒక తర్జుమలో బహుమానం పొందాడు అని వ్రాసి ఉంది. ఏంటి బహుమానం అతని జీవితంలో అభివృద్ధి. తన పనిలో దేవుని సహాయం, దేనికి భహుమానం. మొదటిది మందిర సేవ, ఎల చేసాడు హృదయ పూర్వకంగా చేసాడు. అతడు మందిర పని కి భయ పడలేదు, మందిర పని మీద దృష్టి పెట్టాడు, ఆ పనిని పరిపూర్ణం చేసాడు. అందువల్ల అతడు వర్దిల్లాడు, బహుమానం పొందుకున్నాడు. మరి మనం మందిరానికి వెళ్తాము గాని మందిర పనిని మాత్రం పట్టించుకోము. పరిచర్య చేయడానికి భయం, దేవుని కొరత ఉన్నా, ఆ పని నీవు చేయగలిగిన పట్టించుకోవు, ఒకవేళ మొదలు పెట్టిన దానిని పూర్తి చేయ్యాలి అనే భావం ఉండదు. కాని హిజ్కియ వర్దిల్లాడు. హెబ్రీ 6: 10, 12. Heb మీరు చేసిన కార్యమును, మీరు పరిశుద్ధులకు ఉపచారముచేసి యింకను ఉపచారము చేయుచుండుటచేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు, దేవుడు అన్యాయస్థుడు కాడు. మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిదివరకు కనుపరచిన ఆసక్తిని తుదమట్టుకు కనుపరచవలెనని అపేక్షించు చున్నాము. ఉరకనే వెళ్లి రావొద్దు, దేవుని మందిరం లో నీ పని చాల ఉంది, దేవుడు నిన్ను అసిర్వధించాలని కోరుకుంటున్నాడు. ఏమి చేస్తావ్? నీవు చేసే ప్రతి పరిచర్యకు దేవుడు నిన్ను ఘనపరచి, వర్దిల్లచేయును గాక! నిన్ను పరిచర్యకు దురం చేస్తున్న అపవాది తంత్రముల బంధకాలు పగిలి పోవును గాక?
షలోమ్
మీ కొరకు ప్రార్ధించే,
అపొస్తులు నాని బాబు నెల్లి,