క్రైస్తవులను మరో పేరు పెట్టి పిలుస్తారు, విశ్వాసులు. విశ్వాసులు అంటే విశ్వాసము ను కలిగి ఉన్నవారు, విశ్వాసమును ఉపయోగించువారు, విశ్వాసమును బట్టి జీవించువారు. విశ్వాసులమే గాని విశ్వాసము ఉండదు. విశ్వాసము అంటే కనిపించనిది ఉన్నది అని నమ్మడం, జరగనిది జరుగుతుంది అని నమ్మడం, చెయ్యలేనిది చెయ్యగలను అని నమ్మడం. అయితే దీనికి ఆధారం ఏంటి? దేవుడే దానికి ఆధారం, అయన శక్తియే మూలం.. ఎందుకంటే ఆయన సర్వశక్తి గలవాడు. తన వారికొరకు సమస్తాన్ని సమకుడి జరిగించు వాడు. అందుకే అపోస్తులుడైన పౌలు 1 కొరింది 2:4 లో " మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకునక, దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలెను" అని చెప్పాడు. మనుషుల జ్ఞానము అంది సముద్రమును దాటలేము, తిరిగి దాస్యం లోకి వెళ్లి పోవాలని, దేవుని శక్తీ సముద్రాన్ని ఆరిన నేలగా చేసింది, ఈ గోడ ఎక్కలేము, పగల గోట్టలేము అంది మనషుని జ్ఞానం, గోడను పగల గొట్టింది దేవుని శక్తీ. సింహాలు తినేస్తాయి అనుకుంది మనుష్య జ్ఞానం, సింహపు నోళ్లను మూసింది దేవుని శక్తీ. గొర్రెలు కాసుకునే వాడు ఎదగలేడు, ఏమి సాధించ లేడు అంది మనుష్య జ్ఞానం, రాజుగా కూర్చో పెట్టింది దేవుని శక్తీ. 100 సంవత్సరాలు వచ్చేసాయి ఇంకేమి పుడతారులే అంది మానవ జ్ఞానం, గొప్ప జనమును కలిగించింది దేవుని శక్తీ..... ఇంకే ఎన్నెన్నో...... అయితే నీవు మనుష్య జ్ఞానం ఆధారం చేసుకుని దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నావా? దేవుని శక్తిని బట్టి విశ్వాస ముంచుతున్నావా? నీ పరిస్థితి ఏదైనా నీవు విశ్వాసము ఉంచగాలితే దేవుని కార్యాన్ని అనుబవించ గలవు? అట్టి విశ్వాసము కలిగివుంధువు గాకా!
షలోమ్
మీకోరకు ప్రార్ధించే
అపోస్తులు నెల్లి నాని బాబు