THE WORD TODAY
ఒక్లాండ్ లో ఒక వృద్దు రాలు ఇంటిని విడచి ఎక్కడికి వెళ్ళలేని అనారోగ్య పరిస్థితి వచ్చింది. అయితే తను మందిరం లో పియోన వాయించేది. కాని ఇప్పుడు తను మందిరానికి వెళ్ళలేని పరిస్థితి వచ్చింది. ఆమె దేవుని పని ఎలా అయిన చెయ్యాలి అని ప్రార్ధించేది. ఒకరోజు ఒక తలంపు వచ్చింది. వెంటనే ఒక పేపర్ ప్రకటన ఇచ్చింది. అందులో ఇలా ఉంది. "నిరస, బలహీనత లో ఉన్నవారి కొరకు పియోన వాయిధ్య కారిణి మీకోరకు ఫోన్ లోనే మీ కు నచ్చిన పాటకు పియోన వాయిచి వినిపిస్తారు - అయితే ఇది ఉచితం". దానితో తన నెంబర్ ఇచ్చింది. ప్రకటన చుసిన వారిలో అనేకులు ఆమెకు ఫోన్ చేస్తే వారికి కోరుకోనిన పాటను పియోన మీద వాయించేది. వారు హృదయం లో నెమ్మది, ఆనందం పొంది దేవునిలో బలపడే వారు. అనేక మంది హృదయాలు దేవుని వైపు తిప్పబడినాయి. ఈరోజు ఒకసారి నీ పరిస్థితి అలోసించు. నీవు దేవుని పరిచర్య చెయ్యడానికి దేనిని వంకగా చెపుతున్నావు. అనరోగ్యమా, బలహీనత, మరి ఎధైననా? నీవు చేసే ఏ పరిచర్య అయినాను అది అనేక మందికి దివేనకరముగా, నీకు నీ కుటుంభమునకు ఆశిర్వాద కారణంగా ఉంటుంది. అందుకే దేవుని వాక్యం లో సోలోమోను అంటున్నాడు. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనాను నీ శక్తీ లోపం లేకుండా చేయుము. ప్రసంగి 9:10. అది దేవుని పని కానియ్యి మరి నీ జీవినోపాది కానియ్యి ఏదైనా పని చేసేటప్పుడు శక్తీ ఉన్నకోలది చేయడానికి ప్రయత్నించు. అది నీ జీవితానికి ఎంతో తృప్తిని, ఆనందాన్ని ఇస్తుంది. నీ జన్మకు సార్ధకత కలుగుతుంది. దేవుడు నీకు ఇచ్చిన తలంతు, పనిలో నైపుణ్యం ఉపయోగిస్తే ఎలాంటి పరిస్థితులలో అయిన ఆనందంగా బ్రతక వచ్చు....
మీ కొరకు ప్రార్ధించే
అపోస్తులు నెల్లి నాని బాబు