మనకు చాల మంది స్నేహితులు ఉంటారు. వారిలో 3 రకాలైన స్నేహితులు ఉంటారు. నీ శత్రువుకు శత్రువు నీకు స్నేహితుడు, తన నెరవేర్పు అయ్యాక నీతో స్నేహం చెయ్యడు. మీ శత్రువు మీద పాగా తీసుకోవడం వరకు మాత్రమే నీతో ఉంటాడు కానీ వారు నీకోసం కాదు నీ వు తలపెట్టిన కార్యం, ఉద్యోగం, పని, కొరకు నీతో స్నేహం చేసే వారు. వారు ఆ కార్యం వరకు మాత్రమే నీతో ఉంటారు. కానీ దానికి మించి ఆవల నీకు ఉపయోగ పడరు, నీతో ఏకీభవించరు. నీతో కలసి పని చేస్తారు, కలసి ఉంటారు, కలసి సమయాన్ని గడుపుతారు, కానీ వారు నీకోసం కాదు. నీవు చేసే పని, ఉద్యోగం కోసం మాత్రమే. ఒకవేళ వేరే వారి స్నేహం దొరికితే నిన్ను మరచి పోగలరు, వదిలి పెట్టగలరు. మూడవ రకం, కానీ నిన్ను నిన్నుగా ప్రేమించి, నీ కష్టాలలో నీతో ఉంటు, నీ సంతోషం లో పాలు పంచుకుంటూ, నిన్ను గద్దిస్తూ, నిన్ను సరి చేస్తూ, ప్రోత్సహిస్తూ ఉండే వాడు ఒకడు ఉంటాడు వాడే నీకు నిజమైన స్నేహితుడు. ఇలాంటి స్నేహితుడు నీ గమ్యం చేరడానికి కావాలి. ఇలాంటి వారు ఉంటేనే దేవుడు నిన్ను పిలుచుకున్న కార్యం చెయ్యగలవు. అందుకోసమే వారిని సిద్ధపరుస్తాడు. యోనాతాను వంటి వాడు లేకుండా నీవు దావీదు గా ఉండలేవు. అయితే ఆ స్నేహాలు తప్పనిసరిగా మన మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. వారు మనలను వదిలిన గాని వారు నేర్పిన కొన్ని అలవాట్లు ఇంకా మన మీద ప్రభావాన్ని చూపిస్తాయి. అందుకే నీ స్నేహం ఎవరితోనో ఆలోసించుకో, వారి నుండి ఏమి నేర్చుకుంటున్నావో గ్రహించు కో... అందుకే దేవుని వాక్యం లో ఒక మాట ఉంది 1 కొరింది 15:33 1Cor మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరువును. అందరితోను స్నేహంగా ఉండు కానీ నీ నడవడి, నీ జీవితం, నీ గమ్యం, నీ ఆత్మీయత, నీ కుటుంభం ఆలోసించు. అందుకే దావీదు అంటాడు. కీర్తనలు 119: 63 Ps నీ యందు భయ భక్తులు గలవారందరికిని నీ ఉపదేశములను అనుసరించు వారికిని నేను చెలికాడను. మోస పోవొద్దు సహోదరుడా, సహోదరి.. ప్రభువు నీకు బలపరచే స్నేహితులను, ఆత్మీయంగా దేవునికి దగ్గర చేసే స్నేహితులను దయ చేయును గాక !
షలోమ్
మీకొరకు ప్రార్ధించు
అపోస్తులు నాని బాబు నెల్లి,