ప్రియ సహోదరి సహోదరుడ, ఎలిషా కాలంలో యేరికో ప్రాంత వాసులు ఎలిషా యోద్ధకు వచ్చి” అయ్య మా దేశము మంచి ప్రాంతం అయితే ఇ పట్టణం లో ఒక నీటి బుగ్గ ఉంది, దాని వలన అందమయిన ప్రాంతం, పంటలు పండే ప్రాంతం, సారాన్ని కోల్పోయి నిస్సారం గా మారి పోతుంది అని సేవకుని సహాయాన్ని కోరుకున్నారు. పట్టణం చూడటానికి అందంగా ఉంది అందులో సమస్య ఉంది. ప్రియ సహోదరుడ, సహోదరి నీవు పైకి ఆనందంగా కనపడుతున్నావు గాని నీలో సమస్య నిన్ను కృంగదిస్తుంది. ఈరోజు హృదయ బారాన్ని ఎరిగిన మన దేవుడు తన వాక్కులో సెలవిస్తున్నారు... మీ హృదయమును కలవరపడనియ్యకుడి; యోహాను 14:1 John, మరియు నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక యేర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పియున్నాను నీకు తోడైయున్నాను భయపడకుము నేను నీ దేవుడనై యున్నాను దిగులుపడకుము నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను నేనే నీతియను నా దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొం దును. యెషయ 41 : 10 Isaiah. హృదయ రహస్యాలను ఎరిగిన దేవుడు నీ జీవితం లో నిన్ను కృంగదిస్తున్న ప్రతి పరిస్థితిని చక్కపరచును గాక! నీ జీవితాన్ని ఫలబరితంగా మార్చును గాక! హృదయమును సంతోషంతో నింపును గాక!
షలోం.
మీ కొరకు ప్రార్ధించే
అపొస్తులు నాని బాబు నెల్లి