ప్రియ సహోదరి సహోదరుడ,
మానవుడు తృప్తి లేని జీవి. ఎంత చేసిన, ఎంత అనుభవించిన, ఎంత సంపాదించినా, ఎన్ని సాధించినా, ఇంకా ఏదో కవాలి, ఇంకా ఏదో సాధించాలి, ఇంకా ఏదో సంపాదించాలి అని తాపత్రయ పడుతూ సమదానం లేకుండా, తృప్తి లేకుండా జీవితాన్ని కొనసిగించేస్తున్నాడు. తృప్తి లేకుండా సమాధానం ఉండదు, సమాధానం లేకుండా సంతోషం ఉండదు, సంతోషం లేకుండా ఎన్ని ఉంటె ఉపయోగమేంటి? ఎన్ని సాధిస్తే మాత్రం ఏంటి? తృప్తి అనేది మనసులోనుండి కలిగేది. ఆత్మలో కలిగేది. అందుకే సర్వశక్తి కలిగిన దేవుని ఆలయముని గూర్చి దావీదు ఎలా పాడుతున్నాడు “నీ ఆవరణములలో నివసించునట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొనువాడు ధన్యుడు నీ పరిశుద్ధాలయముచేత నీ మందిరములోని మేలుచేత మేము తృప్తిపొందెదము” కీర్తనలు 65:4 Psalms . అందుకే క్రైస్తవుడు ఏమి ఉన్న లేకున్నా సంతోషం గా, ఆనందం గా బ్రతుగ గలుగుతున్నాడు. సంఘముగా చేసే స్తుతి ఆరాధన, దైవ సేవకుడు అందించే దైవ ఉపిరి అయిన వాక్యం, ఒకరి కొరకు చేసుకునే ప్రార్ధనా ఇంకా ఆత్మీయ సహవాసం ధనం, హోదా, బంధువులు ఇవ్వలేని అనుభూతులను మిగులుస్తు నీకు ఒక కొత్త అనుభవం కలుగ చేస్తాయి. బీద లాజారు భిక్షమెత్తుకునే టప్పుడు కుడా సంతోషం గా ఉన్నాడు..... ఈరోజు ఆరధాన దినం, సంఘముగా దేవుని ఆరాదించే రోజు, మందిరపు మేలులతో నింపబడే రోజు... ఒకవేళ నీవు తృప్తి లేని జీవితాన్ని అనుబవిస్తున్నట్టు నీకు అని పిస్తే ఇరోజు తప్పనిసరిగా మందిరానికి వెళ్ళు...... సమస్త మనసులను పరిసోధించ గలిగిన పరమ తండ్రి నీకు సంతృప్తి ని ఇచ్చి నీకు సంతోషము, సమాధానము అనుగ్రహించును గాకా?
షలోం.
మీ కొరకు ప్రార్ధించే
అపొస్తులు నాని బాబు నెల్లి