ఉత్తరాలు. ఒకప్పుడు పావురాలతో పంపే వారని టీవీ లలో చూడటం, చెప్పుకుంటే విన్నాం, తర్వాత నమ్మకస్తులతో పంపేవారు, కాల క్రమేనా వాటి రూపం, విధానం మారింది కాని విలువ మారలేదు. కొన్ని ఉత్తరాలు సమాచారాన్ని తీసుకుని వస్తాయి, కొన్ని సందేశాలను, కొన్ని ప్రకటనలు తీసుకుని వస్తాయి. వచ్చిన ఉత్తరం చదివే వారికి ఉపయోగ కరంగానో, హెచ్చరికగానో, సందేసత్మకంగానో ఉంటాయి. అంటే ఉత్తరం లో వ్రాయబడిన దానిని బట్టి ఎదుటి వ్యక్తిలో సంతోషం దుఖం ఉంటంది. అయితే ఈరోజు దేవుడు మానవాళికి ఒక ఉత్తరం వ్రాసారు, అది దేవుని ఒక సమాచారం, ఒక సందేశం, ఒక హెచ్చరిక. అది మానవాళి రక్షణకై సిద్ధపరచిన ఉత్తరం. ఆ ఉత్తరం నీవే. 2 కొరింది 3:2 2 cor మా హృదయములమీద వ్రాయబడియుండి, మనుష్యు లందరు తెలిసికొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరేకారా?. రాతిపలకమీదగాని సిరాతోగాని వ్రాయబడక, మెత్తని హృదయములు అను పలకలమీద జీవముగల దేవుని ఆత్మతో, మా పరిచర్యమూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికయై యున్నారని మీరు తేటపరచబడుచున్నారు. లోకం నిన్ను చదివి దేవుని సంకల్పంలో మానవాళి చేరాలి అని రక్షింప బడాలని దేవుని కోరిక. అందుకే సజీవ ఉత్తరం గా నిన్ను నన్ను సిద్ధపరిచారు. ప్రభు ఉత్తరం గా అనేకులకు దీవెన కరంగా నీవు జీవితువు గాక!
షలోమ్
మీ కొరకు ప్రార్ధించే,
అపొస్తులు నాని బాబు నెల్లి,