The Word Today
ఈరోజు మరో వ్యాయమ పద్ధతి చూద్దాం... ఇవన్నీ మనం ప్రతి రోజుఆత్మీయ వ్రుది పొందడానికి ఉపయుక్త మయినవి.
హీబ్రూ ౩:13 సమయముండగానే ప్రతి దినము ఒకని నొకడు బుద్ధి చెప్పుకోనుడి. క్రైస్తవ జీవితం ఇరుకైన దారి. అందులో ప్రవేశించడం, ప్రయాణించడం కష్టతరమయినది. మనం మానవ మాత్రులము ఏదో సమయంలో త్రోట్టిల్ల పాటు రావడం ఖాయం. వాక్యం లో సోలోమోను అంటున్నాడు " తప్పక త్రోట్టిల్లుదురు" అని. త్రోట్టిల్ల బాటు రావడం సహజం కాని పడిపోకుండా చూచుకోవాలి. అలా తనను తాను కాపాడుకోవడం కొంచెం కష్ట తరమయినది కాబట్టి వాక్యం చెపుతుంది సహోదరులు ఒకరి నొకరు బుద్ధి చెప్పుకోవాలి అని. ఎవరు భుద్ధి చెప్పగలరు మనకు. మన వలె దేవుని రుచి చుసిన వారే కదా.. అందుకే మనం స్నేహం చేసేటప్పుడే ఆత్మీయవృద్ధి కి సహకరించే వారిని స్నేహితులుగా చేసుకోవాలి. కీర్తనా కారుడు తన కీర్తనలు 119:63 లో అంటున్నాడు. నీ యందు భయ బక్తులు గల వారంధరికిని, నీ ఉపదేశము అనుసరించు వారికిని నేను చెలి కాడను". ఇక్కడ స్నేహితులను ఎన్ను కోవడం లో జాగ్రత్త వహించాలి. `1 కోరింది 15:33 లో దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపును. కాబట్టి మనం దేవుని యందు భయ బక్తుల గలవారిని స్నేహితులు గా చేసుకుందాం, మనం అలాంటి సాంగత్యాన్ని ఇతరులకు అందిదాం. ,మేలు కోరి స్నేహితులు గాయాలు చేయును. కాబట్టి మనం విశ్వాసం లో కదలని వారముగా ఉండగాలుగుతాము.
క్రైస్తవ సహోదరులు ఒక ఇంట్లో సంతానము వలె అన్నదమ్ముల వలె ఉండగలగాలి. ఒకరి లోపాలుఒకరం సరి దిద్దుకుంటూ, ఆయన రాకడ కొరకు ఆయత్త మయుదాం....
షలోమ్
మీ ఆత్మీయ వృద్దిని కోరుకునే,
అపోస్తులు: నాని బాబు నెల్లి
990 882 3196