యాయిరు అనే ఒక సమజమందిరపు అధికారి ఉన్నాడు. అతడు అధికారము, పలుకబడి, ఆస్తి గలవాడు. తనకు 12 సంవత్సరాల కుమార్తె ఉంది. ఆమెకు వ్యాధి కలిగింది. తన ఆస్తిని ఉపయోగించి బాగు చేయించాలి అనుకున్నాడు, అధికారాన్ని ఉపయోగించి ఉన్నతమైన వైద్యాన్ని అందించి ఉంటాడు, పలుక బడి తో ఉన్నతమయిన వైధ్యులను దూరం నుండి రప్పించి ఉండి ఉంటాడు. కాని ఆ బిడ్డ యొక్క వ్యాధి ఆమెను కబలించి వేయడానికి వచ్చినట్టు ఆమెను వదలడం లేదు. ఎంత ప్రయతించిన ఎంత ధనం కర్చు పెట్టిన తన బిడ్డ బ్రతికేల లేదని గ్రహించి, వీటన్నిటి కంటే ఉన్నతమయిన వాడు ఎవరు అని ఆలోచించినప్పుడు తనకు యేసు వారు మదిలోనికి వచ్చారు. పరుగు పరుగున యేసు వారి దగ్గరకు వచ్చాడు. ధనం వైద్యాన్ని ఇవ్వగలిగింది గాని ఆరోగ్యాన్ని ఇవ్వలేక పోయింది, పలుకబడి వైద్యులను రప్పించ గలిగింది గాని జ్ఞానాన్ని కాదు, ఈ లోకంలో ధనం, పలుకబడి, అధికారం చెయ్యలేని వాటిని, వాటికి అతిత మయిన వాటిని చెయ్యగలిగిన వాడు యేసు ఒక్కడే. అది గ్రహించి ఇతడు యేసు యొద్దకు వచ్చి తన ఇంటికి వచ్చి బ్రతిమ లాడి తీసుకుని వెళ్తుంటే మధ్యలో 12 సం|| రాల నుండి రక్త స్రావం కలిగిన స్త్రీ వచ్చి బాగుపడింది కాని ఇంతలో యాయిరు కుమార్తె చనిపోయింది. యేసును తీసుకుని వెళ్ళేది యాయిరు బాగుపడింది మరొక ఆమె... కష్టం నీది ఫలితం వేరొకరిది అవుతుందా... కంగారు పడకు, ఉన్న కొద్ది అవకాశం కోల్పోయావా కంగారు పడకు, బయ పడకు, నీ కంటే వెనుక ఉన్న వారు ఉన్నత స్థితిని పొందు తున్నారా, బాధ పడకు.... అయన గురి నీ మీదే ఉంది... నిన్ను మరణించిన యాయిరు కుమార్తెను బ్రతికించి నట్లు విశ్వాసం ఉంచితే, అయన నమ్మిక ఉంచితే, శూన్యం నుండి సమస్తాన్ని చేసిన దేవుడు నీకోసం నూతన జీవాన్ని ఇవ్వగలడు, నీ కోసంనూతన సృష్టి ని చేయ్యగలడు... నీ కోసం ముయబడిన ద్వారాలు తెరవ గలడు అవసరం అయితే నూతన మార్గాలను సృస్టించ గలడు.
షలోమ్
మీ కొరకు ప్రార్ధించే
అపోస్తులు నాని బాబు నెల్లి
990 882 3196