నిన్నటి దినాన ఆత్మీయ వ్యాయామం లో మొదటి పద్ధతిని అనుసరిస్తున్నారు అని నమ్మికతో రెండవ పద్ధతిని మీ ముందు పెడుతున్నాను. రోజుకి ఒకటి చొప్పున నేను చెపుతున్నా, మీరు మాత్రం ఇవన్నీ ప్రతి రోజు చెయ్యాల్సినవి. నిన్న మాత్రమే కాదు ప్రతి రోజు ప్రభువును స్తుతించుట అలవాటు చేసుకోండి.
రెండవది ప్రార్ధన. తల్లి గర్భం లో ఉన్నప్పుడు శిశువుకు అవసరమైన నుట్రిసిన్స్, ఆహారం నాభి ద్వారా అందించబడుతుంది. అలాగే దేవునితో మనలను కలపి ఉంచేది, దేవుని బలమును మనకు అందించేది ప్రార్ధన. ప్రార్ధన కొరకు మరి కొన్ని విషయాల కొరకు ఇక్కడ క్లిక్ చెయ్యండి;. ప్రార్ధన నిన్ను ప్రభువుకు దగ్గరగా చేస్తుంది, దేవుని సింహాసనాన్ని చేర్చగలదు , మార్పును తేగలదు, అగ్నిని అర్ప గలదు, చెరసాలను ముయ్యగాలదు, తెరువ గలదు, నీకు ఆత్మీయ బలమును ఇవ్వగలదు. అందుకే దావీదు కీర్తనలు 88: 9 లో యెహోవ ప్రతి దినము నేను నీకు మొర పెట్టుచున్నాను అని అంటాడు. ప్రార్ధన మనిషిని దేవుని దగ్గర బంధువున్ని చేస్తుంది. పైన ఫోటో లో ఎలా ప్రార్ధన చేయవచ్చో వచనాలతో ఇవ్వబడింది చుడండి. ఏకాంత ప్రార్ధన, కుటుంభ ప్రార్ధన, సంఘ ప్రార్ధన, భాగస్వామితో కలసి ప్రార్ధన చేయండి. ప్రార్ధన చేయడానికి ఇప్పుడు విలుయితే అప్పుడు ఎక్కడ ఉంటె అక్కడే మనసులో ప్రభువుతో మాట్లాడండి, స్తుతించండి. ఈరోజు ఇది కూడా ప్రాక్టిస్ చెయ్యండి. మా సంఘములో మా విశ్వాసులు ప్రతి నెల మొదటి రోజున 24 గంటల గొలుసు ప్రార్ధన చేస్తున్నారు... ప్రతి నెల 29వ తారికున IPL సేవకులు గొలుసు ప్రార్ధన చేస్తున్నారు... మీరు కూడా మాతో కలసి ప్రార్ధించ దలిస్తే తెలియ పరచండి. మీ కోసం ప్రార్ధన చెయ్య గలము.
షలోమ్
మీ ఆత్మీయ వృద్ది ఆకాంక్షించే
అపోస్తులు నాని బాబు నెల్లి