తల్లి తండ్రి గా మనం మనకు దేవుడిచ్చిన పిల్లలకు దివేనగా ఉన్నామా? శాపం గా ఉన్నామా? మనం చేసే ప్రతి క్రియ ఫలం మన పిల్లలు అనుభవిస్తారని ఎప్పుడైనా అలోసించావా? ఉదాహరణకు మీరు బాగా త్రాగి తిరుగుతూ ఉంటారు, దానివలన మీకు ఆరోగ్యం క్షినిస్తుంది, కాని మీ పిల్లలు దాని ఫలం అనుభవిస్తారు ఎలానో తెలుసా? ఎవరైన మీ నాన్న త్రాగుబోతు కదా, త్రాగి ఆరోగ్యం పాడుచేసుకున్నడంట కదా అంటే వారు సిగ్గు పడరా సమాజంలో, మీ నాన్న దొంగ అంట కదా, మీ అమ్మ తిరుగుబోతు అంట కదా, మీ అమ్మ కజ్జాగోరి అంట కదా. మీ అమ్మ నాన్న ధబ్బలాడు కుంటారంట కదా, ఇలా ఎవరైనా అంటే మీ పిల్లలు సమజంలో మిమ్మును బట్టి ధైర్యంగా బ్రతకగాలరా? ఎవరైనా ఏమైనా అంటారేమో అని భయం తో బ్రతకవలసిందేనా? ఈరోజు నీను స్కూల్ కి మా పిల్లల్ని తీసుకుని వెళ్తే అక్కడ బూట్లు వేసుకుని రాలేదని పిల్లల్ని టీచర్ కొట్టడం చూసాను. పిల్లలు ఎందుకు ధబ్బలు తింటున్నారు దానికి కారణం ఎవరు? తల్లి తండ్రి యే కదా, వీరు బూట్లు కొంటె వారు ధబ్బలు తినరు కదా. ఒకసారి అలోసించండి. దేవుని వాక్యం చెపుతుంది. కీర్తనలు 127: యెవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతులోని బాణముల వంటివారు. మరి మీ పిల్లలు బాణాలుగా గురిని చేధించే వారిగా ఉన్నారా? నీ వాళ్ళ సమాజం తిరగ లేక దారి తప్పిన బాణాలుగా ఉన్నారా? ప్రభువు మీ పిల్లలను సమాజానికి ప్రయోననకరులగా మార్చును గాక!
షలోమ్
మీకోరకు ప్రార్ధించే
అపోస్తులు నెల్లి నాని బాబు