యేసు నేను నీకేమి చేయ గోరుచున్నావని వాని నడుగగా, యేసు వారు తన శక్తికి నిదర్సనమయిన మాట మాట్లాడుతున్నారు. నీకు ఏమి కావాలో కోరుకో అంటున్నారు. ఇక్కడ అడిగేదానికి హద్దులు, పరిమితులు లేవు ఎందుకంటే ఇచ్చేవానికి హద్దులు పరిమితులు లేవు గనుక. ఆయన అడుగు వాటన్నిటి కంటెను ఉహించిన వాటి కంటే శ్రేష్టమయిన దీవెనలు దయచేయగలవాడు. ఈరోజు నీ హృదిలో ఎకోరిక ఉన్న ఆశ ఉన్న దానిని తీర్చగలుగుటకు ఆయన సమర్ధుడు. భూమి మీద, ఆకాశ మందును ఆయనకు సర్వాదికారం కలిగిన వాడు. ఆరోగ్యం, సంపద, కీర్తి, సంతానం, ఉద్యోగం, వ్యాపారం, అభివృధి, సమాధానం, నెమ్మది, శత్రు విముక్తి, విజయం, జ్ఞానం ఏదైనా ఆయన శక్తీ మించినవి కావు. ఈరోజు ఆయన నీకు ఏమి చెయ్యాలని కోరుకుంటున్నావు. అడుగు దానిని అయన నీకు చేయుటకు ఇష్టత చుపించుచున్నాడు. ప్రభువు మీ కోరికలను సంతృప్తి పరచి బలపరచును గాక.
షలోమ్
మీకొరకుప్రార్ధించే
అపోస్తులునెల్లినానిబాబు