తిరిగి మిమ్ములను కలచుటకు దేవుడు చూపిన కృపను బట్టి ఆయనకే మహిమ. నేను, నా భార్య గతించిన వారం పశ్చిమ బెంగాల్ పరిచర్య నిమిత్తము వెళ్ళాము. అక్కడ నా తమ్ముడు సేవ చేయుచున్నాడు. అక్కడ నేను గమనించిన ఒక విషయం నన్ను బాగా ఆకర్షించింది. అక్క ఉన్న స్నేహితులు వారి స్నేహితులకు ఎక్కువ బహుమానాలు ఇచ్చుకుంటూ ఉంటారు. సంధర్బం అవ్వని కానియి, స్నేహితుని ఇంట్లో ఏదైనా కొరత ఉంది అంటే ఎవరో ఒక స్నేహితుడు ఆ కొరత తిరిస్తూ ఉంటారు. అయితే తీసుకున్న వారు కుడా ఏదో ఒకటి వారికి బహామానం ఇస్తూ ఉంటారు. మాకు కూడా బహుమానాలు ఇచ్చారు. మేము కుడా వారికి వచేటప్పుడు ఇచ్చి వచ్చాము. ఇలాంటి సందర్భములో ఒక ఉన్నత మయిన బహుమానాన్ని గుర్తు కు వచ్చింది... మన సృష్టి కర్త అయిన దేవుడు, ఎల్-షద్దాయి యోహాను3:16 లో ఒక విలువయిన బహుమానము ఇచ్చినట్లు ఉంది. అదేంటో తెలుసా? తన కుమారున్నే నా కొరకు నీ కొరకు భాహుమనంగా ఇచ్చేసారు..... అయన మన కొరకు కొరడా దెబ్బలు తిన్నాడు.... సిలువ వెయ బడ్డాడు.. నిన్ను నన్ను పరిశుద్దున్ని చేసారు... అయితే బహుమానమునకు ప్రతి బహుమానము మనము ఇవ్వాలి కదా,... ఆయనకు మనం ఇచ్చే బహుమానము మన హృదయము.... వెండి బంగారము అడగలేదు నీ హృదయము ను మాత్రమే అయన కోరుకుంటున్నాడు. ఇచ్చి పుచ్చుకోవడం లో ఉన్న ఆనదం మరి దేనిలో మనం పొందలేము. ఇక్కడ మనం పొందే ఆనందం రక్షనానంధం. అటువంటి రక్షణ ఆనందముతో ప్రభువు నిన్ను దీవించును గాక !
షలోమ్,
మీకొరకుప్రార్ధించే
అపోస్తులునెల్లినానిబాబు