The Word Today
ప్రతి రోజు మనం మన సరిర ధృడత్వం కొరకు వ్యాయామం చేస్తుంటాం కదా మరి నీ ఆత్మీయ ధృడత్వం, అభివృధి కొరకు ఆత్మీయ వ్యాయామం చేయవా.... ఆత్మీయ వ్యాయామాలు రోజుకు ఒకటి చొప్పున ఇక్కడ మీకు అందిస్తాను. వాటిని ఆచరించి చుడండి.. మీలో గొప్ప మార్పు కనపడుతుంది.
భూమి మీద రెండు జంతువులు మనకు ఒక చిన్న పాటాన్ని తెలియ పరుస్తాయి. అందులో ఒకటి కోడి తను తినిన ప్రతి సారి, గుటక వేసిన ప్రతిసారి పైకి చూస్తుంది. అంటే తను కలిగివున్న అంతయు దేవుడిచ్చినదే అని ఆకాసమందున్న దేవుని స్తుతిస్తుంది. అదే మరియొక జీవి ఉంది. అది ఎప్పటికి ఆకాశమువైపు కనులెత్తి చూడనే చూడదు... తను ఎప్పుడు క్రింద ఉన్న వాటినే చూసుకుంటూ నేతుకుకుంటు ఉంటుంది. మరణం వచ్చినప్పడు మాత్రమె పైకి చూసి ఏడుస్తుంది. మానవుడు కూడా దేవుడు ఎన్ని ఇచ్చినా వాటిని వెతుకు కుంటూ, ఇంకా ఏదో కావాలి అంటూ భుసంబంధమయిన వాటి మీదనే మనసును పెడుతున్నాడు గాని అసలు ఇప్పటి వరకు దేవుడుఇచ్చిన వాటి కొరకై ఆయనకు స్తుతి చెల్లించ లేకపోతున్నాడు. కీర్తనలు 1451 అనుదినము నేను నిన్ను స్తుతించేదను. 92:1 లో యెహోవాను స్తుతించుట మంచిది. అని దావీదు తన ఆత్మీయ ఎదుగుదలకు, దేవుని హృధయానుసారుడుగా పిలువ బడుటకు తను చేసిన పనిని మనకు ఇస్తున్నాడు. స్తుతించుట వలన దేవునికి సింహాసనం వేయ గలుగుతాము. ఇప్పటి వరకు దేవుడు ఇచ్చిన ప్రతి వాటి కొరకై ప్రభువును స్తుతించు. ఇరోజంత స్తుతించటం మాత్రమే చెయ్యండి.... నోటితో, క్రియలతో, అర్పనలతో స్తుతించుట అలవాటు చేసుకోండి...
షలోమ్
మీ కొరకు ప్రార్ధించే
అపోస్తులు నాని బాబు నెల్లి
990 882 3196