చాల పర్యాయాలు కొబ్బరి చెట్టును పాతి మామిడికాయలు కోసం ఎదురు చూస్తున్నట్టు మనం మంచి ఫలితాల కోసం ఎదురుచూస్తుంటాము. దేవుని వాక్యం చెపుతుంది నీవు ఏమి విత్తవో అదే కోస్తావు అని. యేసువారు స్వయంగా మనవ జీవిత యాత్రలో సమాజంలో మనం ఎలా బ్రతకాలో మనకు నేర్పుతూ లూకా 6:31 మనుషులు మీకేలాగు చేయవలెనని మీరు కోరుదురో ఆలాగు మీరును వారికి చేయుడి. ఇది మనలను మన మనసులను సృజించిన సృష్టికర్త మాట.. నీవు ఇతరుల నుండి ప్రేమను కోరితే ప్రేమను పంచు, ఇతరులు నీకు సహాయం చెయ్యాలని నీవు కోరుకుంటే నీవు సహాయాన్ని చెయ్యి,గౌరవం కావాలా గౌరవాన్ని ఇవ్వు. ఇతరులు నుండి నీవు ఇది కోరుకుంటే అది ముందు నీవే చెయ్యాలి. మన జీవితానికి వాక్యం ఒక మాన్యువల్ లాంటిది. న్యాయాధిపతులు 1:7 లో నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతి ఫలమిచ్చెను అని అధొనీ బెజెకు రాజు అంటున్నాడు. ఈరోజు నీ మనస్సు, మాట, విధానం మార్చుకుని బ్రతుకడం ప్రవర్తించడం మొదలు పెడతావా... ప్రభువు నిన్ను దీవించును గాకా !
షలోమ్
మీకొరకుప్రార్ధించే
అపోస్తులునెల్లినానిబాబు