ముందు ఇవ్వబడిన రెండు క్రియలు ఆరాధన, ప్రార్ధన ప్రతి రోజు చేస్తున్నారు అని భావిస్తున్నాను. ఈరోజు మూడవ వ్యాయామ పద్ధతి చూదం.
కీర్తనలు 1:2 యెహోవ ధర్మశాస్త్రము నందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించు వాడు ధన్యుడు. నేహేమ్య 8:18 మెదటి దినము మొదలకుని కడవరి దినము వరకు అనుదినము ఎజ్రా దేవుని ధర్మశాస్త్రమును చదివి వినిపించుచు వచ్చెను. ప్రార్ధన అనేది మనం దేవునితో మాట్లాడటం, వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ప్రతిఒక్కరు ఆత్మీయంగా వృద్ధి చెందటానికి ప్రతి రోజు వాక్యం చదవాలి. వాక్యం మనలను ప్రతి బింప చేసే అద్దం వంటిది ( యాకోబు 1:23 - 25 ), బండ బారిపోయిన హృదయములను పగుల గొట్టే సుత్తి వంటిది( యిర్మియ 23:29 ), మార్గం లో వేగునిచ్చే దీపం వంటిది( కీర్తనలు 119: 105 ), ఆరోగ్యాన్ని ఇచ్చే పాల వంటిది ( హీబ్రు 5:12-14 ), బలమును ఇచ్చే ఆహారము వంటిది ( 1 కొరింది ౩:1,2 ), రెండు అంచుల ఖడ్గం వంటిది ( హీబ్రూ 4:12 ), బంగారమును సుద్ధి చేయు అగ్ని వంటిది ( యిర్మియ 23:29 ), సుద్ధి చేయు జలము వంటిది, ఆహ్లాధమునిచ్చు జుంటే తేనె ధరల కంటే మధుర మయినది, దేవునితో జత చేయుటకు మనలను పట్టుకునే లంగరు వంటిది ( హీబ్రూ 6:18 ). అలాంటప్పుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క బైబిల్ ఉండాలి కదా. మీ ఇళ్ళల్లో అందరికి ఒక్కటే భోజనం గిన్నెవాడరు కదా? అలాంటపుడు ఎవరిది వారికి బైబిల్ తప్పనిసిగా ఉండాలి కదా............ అదే నీకు దేవుని చిత్తాన్ని తెలుసుకునెందుకు ఆధారం .. ఇరోజు నుండి తపక విడువక వాక్యాన్ని చదివి దైవ దీవెనలు పొండుకుంధువు గాక
షలోమ్,
మీ ఆత్మీయ వృద్ధిని కోరుకునే......
అపోస్తులు నాని బాబు నెల్లి,
990 882 3196