చాలా మంది రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడి సంపాదిస్తూ ఉంటారు. సంతోషమే కానీ అందులో చాలా మంది చెపుతూ ఉంటారు అయ్యా ఎంత సంపాదించినా మాకు ఉన్న కష్టాలు తీరడం లేదండి అని నిరాశ పడుతుంటారు. ఎంత సంపాదించినా అది చిల్లు సంచిలో వేసినట్లే ఉంటుంది. అయితే అలాంటి సమయాల్లో ఇరుగు పొరుగు వారు ఉచిత సలహాలు చెపుతుంటారు. వాస్తు బాగుండలేదు అని, ఇల్లు మార్చేయ్యి… నీకు ఎదో కీడు ఉందేమో అది చెయ్యి ఇది చెయ్యి.. కాకపోతే ఇంకా ఏవేవో చెపుతూ నీకు ఉన్న సంపాదన, కొద్దింపాటి పొదుపును కూడా కర్చుపెట్టే ఆలోచనలు చెపుతుంటారు. కానీ నేను చెపుతాను నీ కష్టార్జితం నీకు ఉపయోగకరం గా, దీవెన కరం గా ఉండాలి అంటే నీవు గొడ్డుల సంపాదించడం కాకుండా దేవుని యందు భయం భక్తి కలిగి ఉండాలి, ఆయన త్రోవలో నడచిన వరమై ఉండాలి. కీర్తనలు 128:1. అందుకే దేవుని యందు భయ భక్తులు కలిగిన యోబు చేతి పని ( యోబు 1: 14 ) చేసుకుంటూ ఉన్నప్పటికీ అతడు మిక్కిలి ఆస్తి పరుడైనాడు. నీవు చేసేది చిన్న పని అయిన దానివలన ఆస్తిపరుడుగా ఉండాలి అంటే దేవుని మార్గం లో నడవ గలగాలి. ఆయన మార్గం లో నడవడానికి ఇష్టపడితే దేవుని వాక్యం నీకు ఎలా నడవాలి అన్నది చెపుతుంది. దేవుని మార్గం లో నడచి నీవు అస్తి పరుడవుగా అగుదువు గాక