ఈరోజుల్లో మానవుని లో బాగా కరువైపోతుంది నమ్మకత్వం. అదువల్లె ఏ చిన్న విషయానికైనా నోట్ లు, కాల్ రికార్డింగ్ లు, వీడియో లు, ఇద్దరు ముగ్గురు సాక్షులు కావలసి వస్తుంది. ఇంకా ఆలోచిస్తే కుటుంబాలలో కూడా ఇది కరువైపోతుంది. ఒక విచిత్రమైన సంగటన మీకు చెపుతాను. మునిమనవల్లను ఎత్తుకుని కాలక్షేపంగా సమయాన్ని గడపాల్సిన 99, 96 సంవత్సరాల ఇటలి వృద్ధ దంపతులు అంటోనియో సి., రోసా సి. కోర్టు మెట్లు ఎక్కారు. ఎందుకో తెలుసా? 1940 లో బార్య కలిగిన అక్రమసంబంధం గురుంచి తెలిసి పెళ్ళైన 77 సంవత్సారాల తరువాత విడాకులు తీసుకుని ప్రపంచం లోనే విడాకులు తీసుకున్న వృద్ధ దంపతులుగా నమోదయ్యారు. నమ్మకత్వం అనేది చాలవిలువైన లక్షణం, అది కొనలేము, పొందుకోవాలి, కాపాడుకోవాలి. ఒక్కసారి కోల్పోతే మరల దానిని పొందుకోవడం అసంభవం. నమ్మకాలు కోల్పోయిన బార్య భర్తల మధ్య ఉండేది ప్రేమ కాదు నటనా జీవితం. ప్రతి మాట, ప్రతి క్రియ ఒక నటనే.... ఒకసారి అలోసించండి, మీ జీవితాకాలం మీరిద్దరే కలసి బ్రతకాలి, ఒకే ఇంట్లో,ఒకే గదిలో, ఒకే బోజన గదిలో కలసి సచ్చేవరకు ఉండాలి, కలసి ప్రయాణాలు, కలసి నిర్ణయాలు తీసుకోవాలి, కుదురుతుందా ఇదంతా నటనతో? నమ్మకత్వాన్ని కోల్పోయే ఏవిధమైన క్రియ అయిన దాయ బడదు ఒక రోజు నీముందు నిలబడుతుంది. లూకా 8:17 తేట పరచబడని రహస్యమేదియు లేదు; తెలియజేయబడకయు బయలు పడకయు నుండు మరుగైనదేదియు లేదు. అప్పుడు నీవు తల ఎత్తుకుని నిలబదగలవా? దానికి ప్రతిఫలం పొందే సమయం లో నీవు ఒర్వగలవా? అవమానము సహించగలవా? అందుకే వాక్యం చెపుతుంది. మరణము వరకు నమ్మకముగా ఉండుము. ప్రకటన 2:10.., నమ్మకమయిన వానికి దీవెనలు మెండుగా కలుగును. సామెతలు 28:20. అయన వెక్కిరింప బడడు. ఆయనే నీకు ప్రతిఫలము ఇస్తారు. నిజమైన ప్రేమను పొందుకుని ఆనదంగా మీరు మీ కుటుంభం ఉండును గాక!
షలోమ్
మీకోరకు ప్రార్ధించే
అపోస్తులు నెల్లి నాని బాబు