దయ్యాలు అంటే ఎవరు? దయ్యాలు ఉన్నాయా? దయ్యాలు ఉన్నాయి. కాని వారు మనకంటే ముదుగా చనిపోయిన వారు కారు. దయతో ఒక ఉదాహరణ జాగ్రతగా గమనించండి. ఒకరోజు మా ఇంటిదగ్గర ఫంక్షన్ కానీ అమలాపురం నుండి క్రొత్త జంట వచ్చారు. ఫంక్షన్ అయ్యిపోయిన 10 రోజులకు ఆ సహోదరడు నాకు ఫోన్ చేసి ఒక పేరు చెప్పి ఎవరు అని దిగాడు. ఆ వ్యక్తి ఈ మధ్యనే చని పోయారు అని చెప్పాను. అందుకోసమే ఫోన్ చేసాను అన్నయా ... ఆ వ్యక్తి నా భార్యను పట్టుకుని పిడిన్చేస్తుంది, మీ ఉరు పేరు చెపుతుంది, తన పేరు చెపుతుంది, ఇంట్లో ఒక వ్యక్తి పేరు చెపుతుంది అన్నాడు. అయితే మా ఊరి దయ్యం కాబట్టి నాదే భాద్యత అనుకుని నేను వేరే సేవకులను తీసుకుని వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తరువాత స్టొరీ అంత విన్నాను అయితే పేర్లు మా ఊరి వారివే, కాని స్టొరీ మాత్రం మాది కాదు, చెపుతున్న పేర్ల వ్యక్తుల మధ్య సంబంధం తప్పు. నేను ఆ వురి నుండే వచ్చాను అని చెప్పను. కొంచెం సేపు ఏమి మాట్లాడకుండా ఆ దయ్యం నా వైపు చాల కోపం గా ఉక్రోషంగా చూస్తూ ఉంది పోయింది. ప్రార్ధన చేసాము అది వదిలిపోయింది. అక్కడ కి బిళ్ళకూరు విషయాలు తెలియవు కదా అని అనుకుని వారిని బ్రమ పెట్టధమని అనుకుంది కాని కుదరలేదు. దయచేసి ఈరోజు ఒక వాక్య సత్యాన్ని చెపుతాను నమ్మండి. చని పోయిన వారు బ్రతికి ఉన్నవారికంటే ధన్యులు అని వాక్యం చెపుతుంది. వారు అమర్త్యమయిన శరీరాలు ధరించుకుని, దిగంబరులుగా కాక తెల్లని వస్త్రాలు ధరించుకుని దేవుని సముఖములో ఉంటారు. మరణించిన వారు ఇక్కడ ఉండారు. చనిపోయిన వారి గురుంచి వాక్యం చెపుతున్న సత్యం " అయితే చచ్చిన వారు ఏమియు ఎరుగరు; వారి పేరు మరువబడి ఉన్నది, వారికిక ఈ లాభము కలుగదు. వారిక ప్రేమింపరు, పగ పెట్టుకొనారు, అసూయ పడరు, సూర్యుని క్రింద జరుగు వాటిలో దేని యందును వారికిక నేప్పటికిని వంతు లేదు. ప్రసంగి 9: 5,6" మన పితరులు ప్రభువు నందు ఉన్నటయితే ఒక రోజు మనం వారిని చూస్తాము. అట్టి కృప ప్రభు నీకు నాకు దయచేయును గాక!
షలోమ్
మీకోరకు ప్రార్ధించే
అపోస్తులు నెల్లి నాని బాబు