అమోస్ అనే ఒక సహోదరుడు మా సంఘములో ఒక మంచి మాదిరిగా ఉన్నాడు. తను దుబాయ్ లో రిగ్గింగ్ కంపనీలో పని చేస్తున్నారు. తను మొదటిలో అక్కడికి వెళ్ళాక ముందు ఒక చిన్న కంపెనీ లో పని చేస్తూ ఉండేవారు. ప్రార్ధించగా ఒక అవకాశాన్ని ప్రభువు ఇచ్చారు దానితో దుబాయి వెళ్లారు. వెళ్ళిన మొదటి నెల నుండి తన భార్య ప్రోత్సాహము తో ఒక అలవాటు చేసుకున్నారు. తన ఆదాయం లోనుండి 10 వ వంతు ప్రభువుకు ఇవ్వడాన్ని అలవాటుగా మార్చుకున్నారు. దేవుని వాక్యం చెపుతుంది లేవి 27:30 భూదాన్యములలోనేమి వృక్ష ఫలములలో నేమి భూఫలములన్నిటిలో దశమ భాగము యెహోవా సొమ్ము; అహి యెహోవాకు ప్రతిస్టితమగును. మలాకి 3:10 ......పదియవ భాగమంతయు మీరు నా మందిరపు నిదిలోనికి తీసికుని రండి; దీని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి, పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించేధనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుని వాక్యమును బట్టి నమ్మకముగా దేవునికి ఇవ్వడం ప్రారంబించారు. చాల మంది ఆయనను అ పని నుండి మానిపించాలని , చాల విధాలుగా ప్రయత్నాలు చేసారు. అంత డబ్బులు మందిరం లో ఏదైనా చేయ్యోచు కదా అంటే అది దేవుని సొమ్ము దానితో మన పెత్తనాలు చేయకూడదు అనే వారు. ఏదైనా మందిరం చేయవలసి వస్తే ధసమబాగాములో నుండి కాక పై సొమ్ములతో ఘనముగా దేవుని పని చేసేవారు, చేస్తున్నారు. అందుకే తన జీవితంలో దేవుడు ఒక గొప్ప కార్యాన్ని చేసారు. ఉహకు అంది కార్యం. ఆమోసు గారు ఉద్యోగంలో జాయిన్ అయిన సంవత్సరానికి ఆ కంపనీలో 8 సంవత్సరాల తరువాత పని బదలాయింపు కోసం ప్రయత్నాలు జరిగాయి. అప్పటికే ఆమోసు గారి కంటే 8 సంవత్సారాల ముందు నుండి ఉన్నవారు చాలా సంబర పడ్డారు కాని వారెవ్వరికి రాని అవకాసం దేవుడు ఆమోసు గారికి దయచేశాడు. వెళ్ళిన సంవత్సరానికి తన కంటే ముందు నుండి ఉన్నవారికి లేని భాగ్యాన్ని ప్రభువు దయచేశాడు. అంతే కాదు ౩ వ సంవత్సరం లో మరో ఉన్నత పనిలోనికి బదిలి అయ్యారు. తను ప్రారంబంలో తీసుకున్న జీతానికి 2.5 రెట్లు ఎక్కువ జీతాన్ని ౩ సంవత్సరాలకు పొందగలిగారు. కారణం ఒక్కటే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా పాటించడం. వాక్యం లో ఉన్న విషయాన్ని మరల దేవుడు నిన్ను ప్రేరేపించాడు నీకు నీవుగా నిర్ణయం తీసుకుని నీవు వెళ్ళే మందిరంలో, నీవు వాక్యం విని బలపడుతున్న సంఘంలో అరిపించడమే. నీ సొంత సంఘాన్ని విడిచి ఆడంబరాలకు, ప్రలోభాలకు లోనై ఎక్కడెక్కడో ఇవ్వడం సరి అయిన క్రమం కాదు. క్రమం లేని అర్పణ అంగికరింపబడదు. విత్తని వానికి కోత కోసే హక్కు లేదు. ప్రభువు నీవు విత్తుతున్న కొలది నిర్ణయ అసిర్వధములతో నిన్ను నింపును గాక!
షలోమ్
మీకోరకు ప్రార్ధించే
అపోస్తులు నెల్లి నాని బాబు