నీ జీవితం లో ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలం అవుతున్నవా? నాకే ఎందుకు ఎలా జరుగుతుంది అని దేవుని నిందిస్తూ చింతిస్తున్నవా? ఒక చిన్న చైనా స్టొరీ, చైనా దేశం లో అధిక సంపన్నుడు, ఆలీబాబా గ్రూప్ స్థాపితుడు జాక్ మ, ప్రాధమిక స్కూల్ లో రెండు మార్లు ఫెయిల్ అయ్యాడు, మిడిల్ స్కూల్ లో రెండు మార్లు ఫెయిల్ అయ్యాడు, యూనివర్సిటీ లో ౩ మార్లు ఫెయిల్ అయ్యాడు, 30 మార్లు ఉద్యోగానికి చేసిన ప్రయత్నాలలో తిరస్కరించ బడ్డాడు, పోలీస్ ఉద్యోగం కోసం తనతో 5 గురు ప్రయత్నిస్తే 4 గురుకి ఉద్యోగాలు వచ్చాయి కాని ఇతడు తిరస్కరించ బడ్డాడు, KFC చైనా కి వచ్చిన కొత్తలో 24 మంది ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే 23 మంది ని తిసికుని ఇతడిని మాత్రమే తిరస్కించారు, హార్వర్డ్ అనే కంపెనీ లో జాబ్ కోసం వెళ్ళిన 10 సార్లు తిరస్కరించ బడ్డాడు, జీవితం లో ఇన్ని సార్లు ఎవడు తిరస్కించబడి ఉండడు. నీవు కూడా అన్ని సార్లు ఫెయిల్ అయివుండి వుండవు, కాని జాక్ మ తన ప్రయత్నాన్ని విడిచి పెట్టలేదు. ఇరోజు ఎవరైతే తనను ఒకప్పుడు తిరస్కరించారో వాళ్ళ సభలలో ప్రపంచ ధనవంతులలో ఒకడిగా, విజయవంతమైన వ్యక్తిగా చీఫ్ గెస్ట్ గా వెళ్తున్నాడు. అందుకే వాక్యం చెపుతుంది దేవుని ప్రేమించు వారికి, అనగా అయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. రోమ 8:28 నీవు వెళ్ళిన చోట తిరస్కరించ బడుతున్నవంటే నీవు చేసే ప్రయత్నం దేవుడు నీకు నిర్ణయించినది కాదేమో! దానికంటే ఉన్నతమయినది, విలువయినది, శ్రేష్టమయినది దాచి ఉంచడేమో... నీవు ఉద్యోగిగా ఉండాలనుకుంటే దేవుడు నిన్ను అనేక మంది కి ఉద్యోగాలు ఇచ్చేవానిగా చెయ్యాలని అనుకుంటున్నాడెమో.... అక్కడే ఉండి అలోసించేకంటే కొంచెం ఉన్నతంగా ఎందుకు అలోసించకుడదు..... దేవుడు నిన్ను నీకు సిద్ధపరచిన దిశ వైపు నడిపించును గాక! దేవుని ప్రేమించు, ప్రార్ధించు, అయన కొరకు జీవించు...
షలోమ్
మీకోరకు ప్రార్ధించే
అపోస్తులు నెల్లి నాని బాబు