మానవ జాతిని సాతాను తప్పు త్రోవ పట్టించడానికి, దేవునికి దూరం చేసి, పతనానికి దగ్గర చేయడానికి వాడే మూడు బాణాలు W-W-W. మొదటిది wine, మద్యం. బైబిల్ చెపుతుంది మద్యం వెక్కిరింతల పాలు చేస్తుంది, త్రాగుబోతులు దరిద్రులగుదురు, దృష్టి లోపం కలుగుతుంది, మద్యానికి అలవాటు పడినవారు గొడవలు కు కారణంగా ఉంటారు, మద్యం సర్పం వలె కాటు వేస్తుంది, వెఱ్ఱి మాటలు వస్తాయి, అది సారం లేని ఆహారం కాబట్టి ఆరోగ్యం క్షీణిస్తుంది ( సామెతలు 23 అధ్యాయం, యెషయ 55 అధ్యాయం, ). దీనికి అలవాటు పడిన వాడు దేవునికి దూరం అయ్యి సమజం లో విలువను కోల్పోయి ఆరోగ్యాన్ని కోల్పోయి పతన స్థితికి వచ్చేస్తాడు. రెండవది: Wealth, ధనాశ. ఎలాగైనా ధనవంతులం కావాలనే ఆశ. వాక్యం ధనవంతులకు, అస్తిపరులకు, ధన సంపాదనకు వ్యతిరేకం కాదు. దేవుని ఆశిర్వాదం ఐశ్వర్యాన్ని ఇస్తుంది అని బైబిల్ చెపుతుంది. కాని దానిని సంపాదించాలనే పేరాశ లంచాలు, దోపిడిలు, దొంగతనాలు, అక్రమాలు చేయడానికి, పిసినారి తనంగా ఉండటానికి ప్రేరేపిస్తుంది. అది చివరకు సస్పెన్షన్, డిబార్, ఉద్యోగాన్ని కోల్పోవడం, సమాజములో విలువ లేని వానిగా చేస్తుంది. తద్వారా పతన స్థితికి చేరుకుంటారు. సామెతలు 28:20, 20:21, 11:28, 15:27,28, 16:8, 20:17. లంచము గురుంచి మాట్లాడి దానిని వ్యతిరేకించిన ఒకే ( మత ) గ్రంధము పరిశుద్ధ గ్రంధము. ద్వితి 16:19; ప్రసంగి 7:7; మూడవది : woman., స్త్రీ కాంక్ష, శరిరాస, దేవుని వాక్యం చెపుతుంది. వివాహములో పాపము లేదు, స్త్రీ పురుషుడు కలసి కుటుంబముగా కట్టబడి, ఫలించబడి ఉండటమే దేవుని నిర్ణయం. కాని అంతకు మించి పొరుగు స్త్రీని గాని పురుషున్ని గాని ఆశించినట్లయితే దాని వలన జీవితం లో పతన స్థితికి చేరవలసి ఉంటుంది అని వాక్యము చెపుతుంది. సామెతలు 23:27; 22:14; 2:16-19; వీటిలో ఎక్కడైనా నీవు సాతానుకు దొరికి పోవొచ్చు గనుక మెలకువతో ప్రార్ధిస్తూ ఆత్మీయ జీవితాన్ని, నీ కుటుంభ విలువలను, నీ భవిష్యత్తును, నీ బిడ్డల భవిష్యత్తును కాపాడుకో సోదరా ప్రియ సహోదరి.....
షలోమ్
మీకోరకు ప్రార్ధించే
అపోస్తులు నెల్లి నాని బాబు