మనకు చాల అలవాటులు ఉంటాయి. అందులో కొన్ని మనం అనుకోకుండానే, మన శరీరాన్ని మన మనసు అలవాటు అయిన క్రియల వైపు నడిపిస్తుంది. ఉదాహరణకు, ఉదయాన్నే లేవగానే ఫోన్ చెక్ చేసే అలవాటు ఉంటె కచ్చితంగా మనం లేవగానే మన ప్రమేయం లేకుండానే మన చేతులు ఫోన్ కోసం నేతుకుతాయి. టీ త్రాగడం అలవాటు అయితే ఆ సమయానికి టీ కోసం శరీరం అల్మటిస్తుంది, లేక పోతే తలపోటు వస్తుంది. అయితే హోషయ గ్రంధం లో ప్రజలకు విచిత్రమయిన అలవాటు ఉంది, అది అబద్ద మాడటం, హత్య చేయడం, దొంగతనం చేయడం, వ్యబిచారం చెయ్యడం వాడుకగా ఉన్నాయంట ( హోషయ 4:2 ). దాని వలన వారు దేవుని ఉగ్రతకు లోనై ఘనత నుండి నీచ స్థితికి, ఎంత ఉన్న, తిన్న తృప్తి లేక, అబివృది లేక దిగజారిన స్థితికి వచ్చేసారు. అయితే మనం క్రీస్తు రక్తము పెట్టి కడగా బడిన వారము కాబట్టి క్రీస్తు వలె నడచుటకు సిద్ధపడవలెను. క్రీస్తు వారు కలిగి వున్నా వాడుకను మనం కలిగి ఉండగలుగుటకు సిద్ధపడవలెను. యేసు వారు కలిగి ఉన్న ౩ అలవాట్లు ( లూకా 4:16 ) దేవుని మందిరానికి వెళ్ళడం, ( లూకా 22:40 ) ఏకాంత ప్రార్ధనలో గడపడం , ( మార్కు 10:1 ) బోధించడం, . మరి నీవును ఆయనను పోలి నడచునతకు ప్రతి వారం మందిరానికి వెళ్తున్నావా? ప్రార్ధనలో సమయాన్ని గడప గలుగు తున్నవా? రోజులో ఒక్క వ్యక్తికైనా నీ సాక్షాన్ని చెప్పగలుగుతున్నవా? కావున మీరు ప్రియులైన పిల్లలవలె దేవుని పోలి నడచుకొనిడి. ఎఫేసి 5:1 . ప్రభువు మిమ్మును శ్రేష్ట మార్గములో నడిపించును గాక!
షలోమ్
మీకోరకు ప్రార్ధించే
అపోస్తులు నెల్లి నాని బాబు