ముందు చెప్పిన మూడు వ్యాయామాలు మీరు ఆచరణలో పెట్టారని నమ్ముతూ నాల్గవ అత్మియా వ్యాయామ పద్ధతి లోకి వెళ్తున్న.. ఇవి మీ ఆత్మీయ ఎదుగుదలకు ఆత్మీయ పరిపక్వతకు దోహదం చేస్తాయి. వీటిని అప్పుడపుడు చేయడం కాదు ప్రతి రోజు చెయ్యాలి.
లూక 9:23 మరియు ఆయన అందరితో ఇట్లనెను - ఎవడైనను నన్ను వెంబడింప గోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకుని, ప్రతి దినము తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింప వలెను. కొంత మందికి సిలువ అంటే క్రైస్తవుల గుర్తు మాత్రమే, కొంతమందికి సిలువ అంటే దయ్యాలను బయపెట్టే గుర్తు, కాని సిలువ మానవ జాతికి కృపను అనుగ్రహించిన భయంకర మరణ స్థలం. రోమా కాలం లో సిలువ మరణ శిక్ష. యేసు వారికి యూదుల పట్టుపై రోమియులు మరణ శిక్షను విధించగా యేసు వారు గోల్గోత వరకు మరణానికి సిద్ధమై సిలువను ఎత్తుకుని ప్రయాణం చేసారు, ఈరోజు మనం కూడా సిలువను ఎత్తుకుని ఏసు వెంట నడవడమే, అంటే మరణానికి సిద్ధమైన వారి వలె యేసును వెంబడించాలి. గలతీ 2:20 లో నేను క్రీస్తుతో కుడా సిలువ వేయబడి యున్నాను. ఇకను జీవించు వాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. 1 కొరింది 15:31 లో నేను అనుదినము చని పోవుచున్నాను.. మనం సిలువ మోస్తూ చని పోవాలి ప్రతి రోజు. మన ఆలోచనలు, కోరికలు, భావోద్వేగాలు, మాటలు, క్రియలు చనిపోవాలి, ఇక మనలో క్రీస్తు వారు మాత్రమే జీవించాలి. యోహాను 4:30 లో బాప్తిస్మము ఇచ్చు యోహాను చెప్పి నట్టు "ఆయన హెచ్చ వలసి ఉంది నేను తగ్గవలసి ఉంది" అని మనం కూడా చెప్ప గలగాలి. నీ సరిర క్రియలను చంపుకుని, శరీరాన్ని నలగ కొట్టుకుని, స్వాధీన పరచు కోలేక పోతే నీవు క్రీస్తు స్వరుప్యం లోకి మారలేవు, ఆత్మీయ పక్యత పొంద లేవు. ప్రభువు నీకు నీ సిలువను మోయుటలో తోడై ఉండి నిన్ను బలపరచును గాక!
షలోమ్
మీ ఆత్మీయ వృద్దిని కోరుకునే,
అపోస్తులు: నాని బాబు నెల్లి
990 882 3196