శీతల ప్రాంతాలలో హీటర్ లు లేనప్పుడు ఇళ్ళల్లో కట్టేలుపోయ్యలు, మంటలు వేసుకునే వారు. అదేవిధంగా మందిరంలో చలి లేకుండా చెయ్యడం కోసం మందిర గోడకు ఆనుకుని ఉన్న గదిలో మంట వేసేవారు. మంట వెలిగించిన మొదటిలో పెద్దగా వేడి ఉండదు కాబట్టి అందరు మంట వేసిన గోడ పక్కన కూర్చునేవారు. అయితే కొద్ది సేపటికి మంట వేడి పెరిగడం వలన ఆ గోడ పక్కన కూర్చోలేక రెండో పక్కకు మారేవారు. అలాగే ప్రతి వారం జరుగుతుంది. ప్రారంభం నుండి పాటలు అయ్యే సమయం వరకు ఒక పక్కన కుర్చుని వేడి పెరిగాక మరోపక్కకు మారడం చేస్తూ ఉండేవారు. అలాగే చాల కలం గడచింది. చర్చి ఆదాయం లో ఆదిక కర్చు పుల్లలకే అవ్వడం గమనించి, చర్చి హీటర్ ( విద్యుత్తు ద్వారా వేడిని కలిగించే యంత్రం ) వేయించి, పాస్టర్ గారు ఉన్నత పరిచర్యకు వెళ్ళ వలసి ఉండి మరో పాస్టర్ గారిని అక్కడ నియమించారు. అయన రాగానే సంఘంలో ఒక వింత చేస్టను గమనించి హడలిపోయారు. అందరు పాటలు అయ్యేవరకు ఒకే పక్క కూర్చుని, పాటలు అవ్వగానే సేవకుని అనుమతి లేకుండా అందరు ఒకేసారి లేచి వేరే పక్కకు వచ్చి కూర్చుంటున్నారు. వాళ్లకు అది ఒక అలవాటుగా మారి పోయింది గాని అందులోని ఆంతర్యాన్ని గమనించడం లేదు. హీటర్ వచ్చినా గాని వారు అలవాటును మానుకోలేక పోతున్నారు. అలాగే మన అలవాటులు, ఆలోచనాలను అనుసరించి ప్రభువును స్తుతించుచున్నమేమో ఒకసారి అలోసించండి. దేవుని వాక్యం చెపుతుంది. మత్తయి 15:6 మీరు మీ పారంపర్యాచారాము నిమితమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు." నీకు ముందు ఉన్నవారు వారు నేర్చుకున్న, వాక్యం అర్ధం అయినట్లు ప్రభువును స్తుతించారు. అయితే ఈరోజు నీవు జాగ్రత్తగా ప్రభువు వాక్యాన్ని ధ్యానం చేస్తూ దేవుని రాజ్య క్రమమును అనుసరించాలి. మీ సేవకునితో దానిని గూర్చి సర్చించి అందులో నీకున్న ఆలోచన సరియినదా కాదా అన్నది నేర్చుకోవాలి. దేవున్ని ఆరాధించుటకు నీకు నచ్చినట్లు, పూర్వికులు చేసినట్లు గాకా దేవుని చిత్తప్రకారము ఆరాధిస్తూ దైవ దీవెనలు పొందండి.
షలోమ్
మీకోరకు ప్రార్ధించే
అపోస్తులు నెల్లి నాని బాబు