అందరికి ఉండే సమస్య భయం. భయం లేని వారు ఎవరు ఉండరు. అసలు భయం అంటే ఏమిటి. తనకు నష్టం కలుగుతుంది అనే ఆలోచనతో తను జాగ్రత్త పడటానికి చేసే ప్రయత్నపు ఆలోచనే భయం. ( నాకు 7 నవంబర్ 2014 న దేవుడిచ్చిన వివరణ ). ఏవిషయములోనైన నీకు భయం కలుగుతుంటే, వాటిని అధిగమించ గలిగే శక్తీ నీకు లేదనే అర్ధం, నీ శక్తీ కంటే సమస్య పెద్దది అని నీవు భావిస్తున్నావు. దావీదు కంటే ఎన్నో రెట్లు పెద్ద వాడు, యుద్ధ నేర్పరి అయిన గోల్యతును తన వడిసేల తో చంపడానికి వెళ్ళాడు. దావీదు గోయతును చంపడానికి యుద్ధ విద్యలు లేవు, ఆయుధాలు లేవు. తను నమ్మిన దేవుని మీద నమ్మకం, ధైర్యం మాత్రమే ఉన్నాయి. ఆ దేర్యమే పెడత్రోవ పడుతున్న ఆలోచనలను క్రమ పరచి వీరునిగా నిలువబెట్టాయి. ఈరోజు నీకు ఎదురుగా నిలబడిన ఎలాంటి శత్రువు అయిన, సమస్య అయిన సరే, ఎంతటి నష్ట సమయ మైన సరే... గుర్తు పెట్టుకో వాక్యం లో ౩65 సార్లు అంటే రోజుకి ఒక్కసారి దేవుడు " భయ పడవద్దు " అని ముందుగానే వ్రాయించి ఉంచారు. నీవు భళహినుడవే, నీ చేతులలో ఉన్నది ఆయుధం కాక పోవచ్చు... కాని నిన్ను పిలచు కున్నవాడు భలవంతుడు, నమ్మదగిన వాడు, విజయశీలుడు. భయ పడకు విజయం నీదే, ఆయనకు అసాద్య మయినది లేదు.
షలోమ్
ప్రబువు సేవలో మీ మిత్రుడు
అపోస్తులు నాని బాబు నెల్లి.