ఒక రోజు ఒక పెళ్ళి హాల్ లో చాలా ఫ్యాన్స్ తిరుగుతున్నాయి. నేను నా మిత్రులు కలసి ఒక ఫ్యాన్ క్రింద కుర్చుని మాట్లాడుకుందాము అనుకుని అని వెళ్లి కూర్చున్నాము. ఫ్యాన్ చాల ఫాస్ట్ గా తిరుగుతుంది. కూర్చున్న కాసేపటికి మాకు చెమటలు పడుతున్నాయి. ఇదేంటి ఫ్యాన్ క్రింద కూర్చున్నాము కదా చెమటలు ఎందుకు పడుతున్నాయి అని గమనిస్తే ఫ్యాన్ తిరుగుతుంది గాని గాలి రావడం లేదు. ఇంతకి ఫ్యాన్ తిరుగుతుంది కాని గాలి రాక పోడానికి గల కారణం ఏంటి అంటే ఫ్యాన్ వెనక్కి తిరుగుతుంది. అదే మొదటి సారి నేను ఫ్యాన్ వెనక్కి తిరగడం చూడటం. ఇంతకి ఈ మాట ఎందుకు చెప్పను అంటే. ఫ్యాన్ తయారు చేసిన ఉద్దేశ్యం అక్కడ జరగలేదు. దాని వలన ఏవిధమైన ఉపయోగం లేదు. అలాగే చాల మంది జీవితం లో కూడా అసలు వారి వలన ఏవిధమైన ఉపయోగం కుటుంభానికి గానీ, సమాజానికి గాని, సంఘానికి గాని ఉండదు. ఆ ఫ్యాన్ తిరిగినట్టు ఉంటుంది చాల మంది జీవితం. అసలు వారు ఈ భూమి మీద ఎందుకు ఉన్నారో, ఎక్కడ ఏమి చెయ్యాలో కూడా తెలియాదు. కారణం ఏంటి అంటే అ ఫ్యాన్ చెపుతుంది ఒక సత్యం. ఫ్యాన్ తయారు చేసినవాడు ఇచ్చిన క్రమంలో అది తిరగకపోవడం, తయారు చేసిన విధానం మరచి, విడచి వేరే విధానం లో తిరగడం వలన నిరుపయోగంగా ఉంది. అదే తయారు చేసిన వాని క్రమంలో తిరిగితే... మానవుని జీవితం కూడా తనను సృజించిన వాని మాట వినడం, అయన అంటుకట్ట బడి ఉండటం మాని వేయడం వలన జీవితం నిరుపయోగం అవుతుంది. మరి ఈరోజు నీ జీవితం నిన్ను సృజించిన దేవునికి అప్పగిస్తావా, ఆయనకు అంటూ కట్ట బడి ఉంటావా... అయితే ఈరోజే నీకు నూతన ప్రారంభం... దయతో ఈ వాక్యాలు చదువు యిర్మియ 29:11; యోహాను 15:5.
మీరు ఫలించాలని ఆశిస్తూ
అపోస్తులు నాని బాబు నెల్లి.
7989 744 799