The Word Today
భర్త భార్య అనే భందం ఒక మధురమయిన, శ్రేష్టమైన బంధం. మనసా, వాచా, కర్మేణ, అతుకబడిన బంధం. దానిని ప్రభువు పవిత్రంగా నిర్మించాడు. దాని వెనుక దేవునికి ఉన్న గొప్ప ప్రణాళిక ఫలించి భూమిని నిండించుట, దానిని లోపరుచుకోనుట. వారిని ఒక్క భార్య ఒక్క భర్త గానే దేవుడు నిర్ణయించాడు గాని బహుబార్యత్వం బహు భర్తత్వం అనేది దేవుని ఉద్దేశ్యం మొదటి నుంచి కాదు. వారిద్దరు ఏక సరిరమై ఉందురు. వారిదరు ఒక్కటే, వేరు వేరు కాదు. అయితే భర్త అంటే ఒక స్త్రీ శరీరం మీద అధికారం కలిగిన వాడు. భార్య అంటే ఒక పురుషుని శరీరం మీద అధికారం కలిగినది. మరణము వారిని వేరు పరచే వరకు వారి ధర్మాలు వారి మధ్యలోనే జరగవలెను. అందులో ఏ ఒక్కరు మరణం పొందిన వారు వివాహ నిబంధన నుండి విముక్తులు. తిరిగి వివాహ చేసుకొనవచ్చు. ఒకరి శరీరం తో ఒకరిని ఘనపరచు కోవడం దేవుడు పెట్టిన నియమావళి. సమరయ స్త్రీ గురుంచి ప్రభువు మాట్లాడినప్పుడు నీకు అయిదుగురు బర్తలు ఉన్నారు అన్నారు. అంటే ఆ స్త్రీ శరీరం మీద అయిదుగురు అధికారాన్ని ఉపయోగించారు. ఒక్క శరీరం మీద ఒక్కటే అధికారం ఉండాలి. అంతకు మించి ఉన్నది క్రమము కానిది. దేవుని కోపానికి గురి అయ్యేది. క్రమము కానిది ఏదో అది పాపము. అందుకే దేవుడు వివాహ వ్యవస్థను నిర్మించాడు. ఎవరి శరీరం మీద ఎవరు అధికారం కలిగి ఉన్నారో సమాజానికి తెలియడానికి, తద్వారా ఇతరులు ఎవ్వరు ఆ శరీరం కొరకు ఆశపడి పాపం చేయకుండునట్లు ప్రభువు దానిని స్థిరపరిచారు. మీ వివాహ జీవితం లో దేవునికి లోబడితే దేవుడు దాచిపెట్టిన ఆసిర్వాధాలు పొందుకుంటారు. అయన క్రమాన్ని గౌరవించే వారిని అయన ఘనపరుస్తారు. 1 కొరింది 7:1 -4 . వివాహ వ్యవస్థను నిర్మించిన దేవుడు మీ కుటుంభం లో మీకు దాచి పెట్టిన అసిర్వాధమును పొందుకుందురు గాక.
మీకోరకు ప్రార్ధించే,
అపోస్తులు నాని బాబు నెల్లి.